వరంగల్ లో సినీస్టూడియో కట్టాలి.. 5 ఎకరాలివ్వండి!

Update: 2021-01-08 14:25 GMT
వరంగల్ జిల్లా కేంద్రంలో సినిమా స్టూడియో ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని వరంగల్ ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు. హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.  

ఫెడరేషన్ అధ్యక్షుడు కరాటే ప్రభాకర్, కార్యదర్శి తాళ్ల పెళ్లి దామోదర్ గౌడ్ నేతృత్వంలో పలువురు మంత్రిని కలిశారు. గతంలో కౌండిన్య స్టూడియోస్ నిర్మాణానికి చేసిన దరఖాస్తుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. అయితే.. అవసమైన 5 ఎకరాల స్థలం మాత్రం ఇంకా కేటాయించలేదని, మంత్రి దృష్టికి తెచ్చారు.

రాష్ట్రానికి రెండవ రాజధానిగా వరంగల్ నగరం వెలుగొందుతోందని, అందువల్ల ఇక్కడ సినీ స్టూడియో అవసరం ఉందని అన్నారు. ఇక్కడ చాలా సినిమా షూటింగులు జరిగాయన్న ప్రతినిధులు.. నగరంలో చారిత్రక ప్రదేశాలతోపాటు మంచి లొకేషన్లు ఉన్నాయన్నారు. చొరవ తీసుకుని సినీ స్టూడియో నిర్మాణానికి సహకరించాలని మంత్రిని కోరారు.
Tags:    

Similar News