మార్గాని దూకుడుకు 'మార్గం' సుగ‌మ‌మైందా...?

Update: 2021-12-28 04:24 GMT
ఆయ‌న యువ ఎంపీ. ఫైర్ బ్రాండ్ కూడా. త‌ప్పులు చేస్తే.. సొంత పార్టీ నేత‌లే అయినా.. ఆయ‌న ఉపేక్షించ రు. ఆయ‌నే తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి పార్ల‌మెంటు స‌భ్యుడు.. మార్గాని భ‌ర‌త్. వైసీపీ నేత‌ల్లో.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఎంపీల్లో మార్గాని ఒక‌రు. ఆయ‌న ఆది నుంచి కూడా పార్టీ కోసం.. ప‌నిచేసే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంనూ.. త‌ర‌చుగా ఆయ‌న తిరుగుతుంటారు. ఉద‌యం వేళల్లో ఆయ‌న మార్నింగ్ వాక్ చేస్తూ.. స్థానికుల‌ను క‌లిసి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తారు. ఇలా.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు.

తాజాగా ఆయ‌న తీసుకున్న చొర‌వ‌.. ఇప్పుడు ఎంపీని ఆకాశానికి ఎత్తేలా చేసింద‌ని అంటున్నారు రాజ‌మండ్రి ప్ర‌జ‌లు. గ‌తంలో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ... రాజ‌మండ్రికి ఒక ఔట‌ర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదించారు. అయితే..త‌ర్వాత వ‌చ్చిన ఎంపీ దీనిపై శ్ర‌ద్ధ చూపించ‌లేక పోయారు. ఫ‌లితంగా ఇది సాకారం లేదు. కానీ, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే అంశంపై మార్గాని ఇక్క‌డి ప్ర‌జ‌లకు హామీ ఇచ్చారు. గెలిపిస్తే.. ఔట‌ర్ రింగు రోడ్డు ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా.. దీనిని సాధించి.. రికార్డు సృష్టించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజ‌మండ్రి (రాజమహేంద్రవరం) కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది. రాజమహేంద్రవరం చుట్టూ 25 నుంచి 30 కి.మీ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. రూ.వెయ్యి కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఎంపీ మార్గానికి ఉత్తర్వులు అందాయి. ఈ రింగు రోడ్డు రాక‌తో.. రాజ‌మండ్రి ప్ర‌జ‌లు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ట్రాఫిక్ స‌మ‌స్య‌లు సంపూర్ణంగా తొలిగిపోనున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అంతేకాదు.,. చుట్టుప‌క్క ప్రాంతాలకు చెందిన భూముల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి. అదేవిధంగా మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు కూడా మార్గం సుగ‌మం కానుంది.

చాలా మంది అయితే అమ‌రావ‌తికే రింగు రోడ్డు లేదు.. కానీ భ‌ర‌త్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ రాజ‌మండ్రికి రింగ్ రోడ్డు సాధించారంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఇక వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత జ‌రిగే రాజ‌మండ్రి కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ అక్క‌డ పార్టీ గెలుపు బాధ్య‌త‌ను సీఎం జ‌గ‌న్ పూర్తిగా భ‌ర‌త్‌కే అప్ప‌గించేశారు. ఏదేమైనా ఇటు పార్టీలో కూడా భ‌ర‌త్ ప్ర‌యార్టీ బాగా పెరిగింద‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News