తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వాగ్దాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన మాటే ఆయన బలం. అయితే ఆ బలం కాస్త తాజా ఉదంతంలో బౌన్స్ అయింది. తన ప్రసంగంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఏకంగా కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్ ను వివరణ కోరారు. ఇంకా చెప్పాలంటే....ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరుకాబోనని తేల్చిచెప్పారు.
ఈ పరిణామంతో టీఆర్ ఎస్ వర్గాలు ఇబ్బందుల్లో పడ్డాయి. గులాబీ దళపతి కామెంట్లతో ఇరకాటంలో పడటం, యువ నాయకుడిని కేంద్రమంత్రి నిలదీసిన నేపథ్యంలో...తండ్రి, అన్న కోసం కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలు అయిన ఎంపీ కవిత ఎంట్రీ ఇచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రిని అవమానపర్చాలనే సంకుచిత ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పారు. మోడీ గారు అనే మాట కేవలం దొర్లిన తప్పిదం మాత్రమేనని వివరించారు. దేశ ప్రధానిని అవమానించుకుంటే దేశాన్ని అవమానించినట్లే అని వ్యాఖ్యానించారు. `చిన్న పొరపాటు దొర్లినందుకు బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తోంది. దావొస్‌లో ప్రధానమంత్రి మాట్లాడుతూ 600కోట్ల మంది నాకు ఓటు వేశారని తప్పు మాట్లాడరు. దేశంలో ఉన్నది 130కోట్ల మంది మాత్రమే. ఇలా మాట దొర్లడం అందరికీ అవుతుంది. అది గమనించాలి` అని కవిత అన్నారు.
రైతుల కష్టాల పట్ల అవేదనతోనే కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని ఎంపీ కవిత వివరించారు. `రైతు బడ్జెట్ అని చెప్పి కేంద్రం రైతులకు కేటాయించింది ఏం లేదు. ప్రత్యేక హోదాకు 2014 నుంచి మద్దతు ఇస్తున్నాం. విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీని కేంద్రం అమలు చేయాలి. ప్రభుత్వం నిరంతర ప్రక్రియ... కనుక హామీలు ఏ ప్రభుతం ఇచ్చిన నిలబెట్టుకోవాలి. వ్యాపారానికి సంబంధిచిన 30బిల్లులు ఇప్పటివరకు పెట్టారు... కానీ వ్యవసాయానికి సంబంధించిన ఒక్క బిల్లు కూడా పెట్టలేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం, నిధుల కోసం మాట్లాడతాం` అని స్పష్టం చేశారు