రాజకీయాల్లో ఏమయినా మార్పులున్నాయా? అంటే బోలెడు మార్పులకు శ్రీకారం దిద్దేవిధంగానే పరిణామాలు ఉన్నాయి అని చెప్పక తప్పదు. బీజేపీ తీర్థంతో గెలిచిన వారు పాపం ఆ పార్టీ వెంట లేరు. కొత్తగా యశ్వంత్ సిన్హా విపక్ష అభ్యర్థిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవికి సంబంధించి ఎన్నికల్లో పాల్గొనే విషయమై, సంబంధిత అభ్యర్థిత్వంతో వెలుగులోకి వచ్చారు. కొడుకును మాత్రం బీజేపీ లో ఉంచి హాయిగా ఆయనొక్కరే ఇటుగా వచ్చి రాజకీయం చేసుకుంటున్నారని విమర్శలున్నాయి. ఆ విధంగా ఆయన నిన్నటి దాకా తృణముల్ గూటి పక్షి. ఇప్పుడు తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గూటి పక్షి కూడా ఆయనే !
ఒక గూటి పక్షులంతా ఒకే చోట చేరిన విధంగా ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో కదలికలు నడుస్తున్నాయి. ఆ కోవలో ఇవాళ నామా నాగేశ్వరరావు అనే ఎంపీ కూడా మెరిశారు. మెరుస్తున్నారు కూడా ! ఒకప్పుడు బాబు గారి శిష్యుడిగా పేరున్న ఈ ఖమ్మం జిల్లా పెద్దాయన ఉన్నట్టుండి ఇంత పేరు కేసీఆర్ దగ్గర ఎలా తెచ్చుకున్నారో అన్నది ఎవ్వరికీ అంతు చిక్కని విషయం అని పరిశీలకులు అంటుంటారు. ఆ విధంగా గులాబీ దండు తరఫున ఢిల్లీ లాబీయింగ్ -లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు కూడా ! కాలం తీసుకువచ్చిన మార్పులో భాగంగా ఒకప్పటి నేతలు ఈ విధంగా రాణించడమే ఆశ్చర్యకరం.
ఎపార్ట్ ఫ్రమ్ దిస్.. కేటీఆర్ కూడా చాలా రోజుల తరువాత ఢిల్లీ వీధుల్లో నడయాడి యశ్వంత్ భాయ్ తో భేటీ అయి వచ్చారు. టీఆర్ఎస్ కోరుకున్న విధంగా ఆయన గెలుస్తారో లేదో కానీ మొత్తానికి దేశ రాజకీయాలను అర్థం చేసుకునే పనిలో అటు కేసీఆర్ మరియు ఇటు కేటీఆర్ ఉన్నారని మాత్రం నిర్థారణ అవుతోంది. పొరుగు రాష్ట్రం సీఎం జగన్ మాత్రం మళ్లీ మళ్లీ మోడీ ప్రేమలోనే ఉంటూ తనదైన రాజకీయం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర పతి ఎన్నికలు అన్నవి కేసీఆర్ ను ఓవైపు, జగన్-ను మరో వైపు ఉంచేశాయి. ఆ విధంగా ఢిల్లీ రాజకీయంలో నామా, కేటీఆర్ ఇవాళ చక్రం తిప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం కానున్నాయో చూడాలిక.