భారత రైతుల పోరాటం పై ఎంపీ ప్రశ్న .. బ్రిటన్ ప్రధాని బోరిస్ ఏంచెప్పారంటే ?
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వం పై కాలు దువ్వుతూ కన్నెర్రజేస్తున్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ, గత కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బ్రిటన్ పార్లమెంట్ లో లేబర్ పార్టీ సిక్కు ఎంపీ తన్మన్ జీత్ సింగ్ ప్రధాని ని మాట్లాడాలని కోరగా ... దీనిపై ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడారు. కానీ, ఆయన సమాధానం ఇని అందరూ ఆశ్చర్యపోయారు. భారత్ , పాక్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సమాధానం ఇవ్వడంతో ఎంపీ తన్మన్ జీత్ బిక్కమొహం వేశారు.
ఆ ఘటన కి సంబంధించిన వీడియోను ఎంపీ తన్మన్ జీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. భారత్ లోని చాలా ప్రాంతాల్లో రైతులు శాంతిపూర్వకంగా నిరసనలు చేస్తున్నారని, కానీ..వారిపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని సభలో వెల్లడించారు. దీనిపై భారత ప్రధానికి చెబుతారా అన్నారు. కానీ..దీనిపై మాట్లాడటానికి బ్రిటన్ ప్రదాని బోరిస్ జాన్సన్ లేచారు. భారత్ – పాకిస్తాన్ తలెత్తిన అంశం ఆందోళన కలిగిస్తోందని, రెండు ప్రభుత్వాలు కలిసి ఒక పరిష్కారం కనుగొనాలని వెల్లడించారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 14 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు తాజాగా కేంద్రం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించారు. సింఘు సరిహద్దులో సమావేశమైన రైతు సంఘాలు చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనల్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. కొత్త చట్టాలను కేంద్రం రద్దు చేసేవరకు తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. డిసెంబర్ 12 ఢిల్లీ-జైపూర్ రహదారి దిగ్బంధనం, దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఆందోళన చేపడతామని రైతులు సంఘాలు వెల్లడించాయి. ఈ నెల 14న దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, బీజేపీ నేతలను ఘెరావ్ చేస్తామని ప్రకటించారు.