ఎస్. నోటీసులు అందాయి.. నేను చేయాల్సింది చేస్తా!: ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యలు
తెలంగాణలో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసలు తెలంగాణతో సంబంధం లేని నాయకులు కూడా తెరమీదికి వస్తున్నారు. వారికి సిట్ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలుస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీకి చెందిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురమకృష్ణరాజు ఉరఫ్ ఆర్ఆర్ ఆర్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని పిలిచింది. అయితే, తొలుత ఆయన తనకు సంబంధం లేదని అన్నారు. నోలీసులు కూడా అందలేదని చెప్పారు.
కానీ, తాజాగా మాత్రం తనకు సిట్ నోటీసులిచ్చారన్న వార్తలపై వైసీపీ ఎంపీ రఘురామ స్పందించారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని స్పష్టం చేశారు. మొయినాబాద్ కేసులో తనకు తెలంగాణ సిట్ నోటీసులు అందాయని రఘురామ కృష్ణ రాజు తెలిపారు.
ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన అధికారులు తనకే స్వయంగా నోటీసులు అందించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు చెప్పారు. అయితే, తనకు ఈ కేసులో సంబంధం లేదని, కానీ, సిట్ నోటీసులు ఇచ్చింది కనుక.. ఏం చేయాలో అదే చేస్తానని ఘాటుగా చెప్పారు.
మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. సిట్‌కు పూర్తి అధికారాలు ఇచ్చింది. దీంతో దర్యాప్తులో భాగంగా ఎంపీ రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లు నిందితులుగా ఉండగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో సిట్ కొత్తగా చేర్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.