వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ప్రకటించారు. ఎంపి చెప్పిందెలాగుందంటే అనవసరంగా దారిపోయే చెత్తను తనంతట తానుగా నెత్తనేసుకంటున్నట్లే ఉంది. ఎప్పుడైతే పార్టీ అగ్రనాయకత్వం తో విభేదాలు వచ్చాయో పార్టీ కార్యక్రమాలకు, జగన్మోహన్ రెడ్డి కి దూరంగా ఉంటే సరిపోయేది. కానీ తిరుగుబాటు ఎంపి అలా కాకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. జగన్ పై వ్యక్తిగతంగా మాట్లాడి బురద చల్లుతున్నారు. దీని ఫలితమే సీఐడీ కేసు, విచారణ తదితర పరిణామాలు.
ఇంత జరిగినా ఎం పి కి జ్ఞానోదయం అయినట్లు లేదు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి నోటికొచ్చింది మాట్లాడుతూనే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే వైసీపీలో తొందరలో జరగబోయే సంస్ధాగత ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ తాజాగా ప్రకటించటం విచిత్రంగా ఉంది. ఏకంగా వైసీపీ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. జగన్ వ్యతిరేక మీడియా తాను ఏమి మాట్లాడినా హైలైట్ చేస్తోందన్న ఏకైక కారణంతోనే తిరుగుబాటు ఎంపి రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే అధ్యక్ష పదవికి పోటీ చేసినంత మాత్రాన గెలుస్తాననే నమ్మకం ఎంపికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అనేది పార్టీ పెట్టిన వారి ప్రైవేట్ ప్రాపర్టీ లాంటిది. ఇలాంటి పార్టీల్లో అధినేతకు వ్యతిరేకంగా ఎవరు పోటీచేయరన్న విషయం తెలిసిందే.
ఒకవేళ పోటీ చేసినా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక జరిగిందని చెప్పుకోవటానికి మాత్రమే సీనియర్లను పోటీ చేస్తారు. ఇలాంటి ఎన్నికల్లో తాను పోటీచేస్తానని తిరుగుబాటు ఎంపీ ప్రకటించుకోవడం విచిత్రంగా ఉంది. నిజంగానే రఘురాజు పోటీచేయాలని అనుకున్నా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడానికి పదిమంది నేతలు ఎక్కడినుండి వస్తారు. ఢిల్లీలో కూర్చుని జగన్ను నోటికొచ్చింది మాట్లాడినంత కాలం ఎంపి సేఫ్ గానే ఉన్నారు.
ఒక్కసారి హైదరాబాద్ కు వచ్చి మాట్లాడినందుకే ఏమైందో అందరు చూసిందే. అలాంటిది రేపు సంస్ధాగత ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఢిల్లీలో కూర్చుంటే కుదరదు. అమరావతికి వచ్చి నామినేషన్ వేయాల్సుంటుంది. అంతకుముందు తన నామినేషన్ ను ప్రతిపాదించ నేతలతో మాట్లాడుకోవాలంటే డైరెక్టుగానే రావాల్సుంటుంది. ఇదంతా జరిగే పనికాదు. అయినా సరే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయితే మాత్రం తిరుగుబాటు ఎంపి అనవసరంగా కెలుక్కుంటున్నట్లే.