నేను రూ.50 లక్షలు ఇచ్చి పదవి కొనుక్కున్నా అర్థమైందాః మహిళా ఎంపీపీ
రాజకీయాలు ప్రజాసేవకోసం కాదు.. డబ్బు సంపాదనకే అని చాలా సంఘటనలు రుజువు చేశాయి. ఈజీగా డబ్బుతోపాటు పేరు కూడా పొందొచ్చని పాలిటిక్స్ లోకి వస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు ఓ ప్రజాప్రతినిధి. తాను రూ.50 లక్షలు పోసి పదవి కొనుక్కున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు విషయం ఏమంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో.. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా.. జయశంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎంపీపీ వినోదను కూడా ఆహ్వానించారు. అయితే.. ఆమె వచ్చేసరికే కార్యక్రమం మొత్తం పూర్తయిపోయింది. వేదికమీద ఉన్నవారు కూడా దాదాపు వెళ్లిపోయారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురై, ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక నాయకులపై మండిపడ్డారు.
''నేను ఎంపీపీగా వట్టిగానే ఎన్నిక కాలేదు. దానికోసం రూ.50 లక్షలు ఖర్చు చేశాను. ప్రతిసారీ నన్ను ఇలా అవమానించడం సరికాదు'' అని అక్కడి లోకల్ లీడర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేవలం ఎంపీపీ పోస్టుకే రూ.50 లక్షలు ఖర్చు చేస్తే.. ఎంపీ, ఎమ్మెల్యే పోస్టులకు ఎంత ఖర్చు చేస్తున్నారో..? అని డిస్కస్ చేస్తున్నారు నెటిజన్లు. రాజకీయాలు బీభత్సంగా కాస్ట్‌లీ అయ్యాయని, ప్రజాసేవ చేయడానికే ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అని సెటైర్లు వేస్తున్నారు.
Full View