యువరాజ్ సింగ్.. 2011 ప్రపంచకప్ భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. ధోని నాయకత్వంలో భారత్ గెలవడంలో యూవీ కీరోల్ పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గానూ నిలిచాడు. అంతటి ప్రఖ్యాత క్రికెటర్ క్రికెట్ లైఫ్ మాత్రం తరువాత తలకిందులైంది. జట్టులో చోటు కోల్పోయి.. అవమానకర రీతిలో క్రికెట్ జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది.
దీనికంతటికి కారణంపై ఇన్నాల్లు నోరు మెదపని యువరాజ్ సింగ్ తాజాగా తీవ్ర దుమారం రేపారు. తన క్రికెట్ జీవితం ముగింపునకు కారణం ధోని, కోహ్లీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ స్పోర్ట్స్ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పరోక్షంగా ధోని, కోహ్లీల వల్లే తాను ఇబ్బంది పడ్డట్టు చెప్పాడు. తన కెరీర్ లో అత్యుత్తమ కెప్టెన్ గా సౌరభ్ గంగూలీకి ఓటు వేస్తానని యువీ చెప్పాడు. గంగూలీ జట్టులో ఆడటం తనకెప్పుడూ సంతోషంగా ఉంటుందన్నాడు. తనను బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి గంగూలీ అన్నాడు. ధోని, కోహ్లీ తనకు మద్దతు ఇవ్వలేదని.. వీరిద్దరూ సపోర్ట్ చేయలేదని కుండబద్దలు కొట్టాడు. దీంతో ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపాయి. ధోనికి సన్నిహితుడైన యూవీ అతడిపై కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు కొందరు యూవీకి సపోర్టుగా.. నెగెటివ్ గానూ కామెంట్ చేస్తున్నారు.