ఎంఎస్ ధోని ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఫేర్ వెల్ మ్యాచ్ లేకుండానే ధోని ఆట నుంచి తప్పుకున్నాడు. అదే అభిమానులను నిర్వేదంలో ముంచుతోంది. గత ఏడాది వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ధోని చివరిది. ఆ మ్యాచ్ ఎంతో విషాదంగా ముగిసింది. వరల్డ్ కప్ వెళ్లేసరికి భారత జట్టు దుర్భేద్యంగా ఉంది. వరుసగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వెస్టిండీస్ జట్లను ఓడించింది. వర్షం కారణంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ రద్దు కాగా, ఒక్క ఇంగ్లాండ్ తో మాత్రమే భారత్ ఓడిపోయింది.
15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్ కి వెళ్ళింది. సెమీఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239 పరుగులు చేసింది. లక్ష్య ఛేదన ఇక భారత్ కు నల్లేరుపై నడకేనని అభిమానులు అంతా భావించారు. మరో వరల్డ్ కప్ ఖాయమని సంబరపడ్డారు. అయితే వర్షం అంతా తలకిందులు చేసింది. ఔట్ ఫీల్డ్ తడిగా మారడంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించడంతో బాల్ వేస్తే చాలు ఫీడర్ల చేతిలోకి బంతి వెళ్తోంది. అలా వరుసగా రోహిత్, కోహ్లీ, దినేష్ కార్తీక్, కే ఎల్ రాహుల్, పెవిలియన్ కి క్యూ కట్టారు. ధోనీ, జడేజా పోరాడి మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లారు.
ఇక 10 బంతుల్లో 25 రన్స్ చేస్తే విజయం ఖాయం అనుకుంటున్న వేళ అనూహ్యంగా ధోని రన్ అవుట్ అయ్యాడు. ఒక రన్ తీసి రెండో రన్ తీస్తున్న ధోనిని గప్తిల్ మెరుపు త్రోతో రన్ ఔట్ చేశాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. ధోని తలదించుకుని కన్నీరు కారుస్తూ పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్ళడం అభిమానులను కంటతడి పెట్టించింది. మ్యాచ్ ను విజయం వైపుగా తీసుకెళ్లి ఆఖరులో ఔట్ కావడం ధోనిని తీవ్ర నిరాశకు గురిచేసింది. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా అతను ఇతర ఆటగాళ్లతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఎప్పుడూ అందరితో నీరాజనాలు పలికిం చుకున్న ధోని ఆ మ్యాచ్ లో తన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ధోనీ నెమ్మదిగా బ్యాటింగ్ కారణంగానే మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చిందని పలువురు విమర్శించారు. అలా ధోని తన చివరి మ్యాచ్ విషాదంతో ముగించాడు.