వికెట్ల వెనుక తోపు అంతే.. ధోని ఖాతాలో మరో రికార్డ్

Update: 2023-04-23 08:52 GMT
41 ఏళ్ల వయసు.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. ఇక ధోని పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఈ వయసులోనూ ధోని చిరుతలా పరిగెత్తుతున్నాడు. వికెట్లను గురి చూసి కొడుతున్నాడు. వెంటాడి మరీ అవుట్ చేస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కీ తనలోని పాత దోనిని బయటపెడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. లేటెస్ట్ గా తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

200 మంది బ్యాట్స్‌మెన్‌లను స్టంప్ అవుట్ చేసిన అద్వితీయమైన ఫీట్‌తో ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నేరుగా 3 వికెట్లు స్టంప్ అవుట్ చేసిన తర్వాత ఎస్ ధోని 200 స్టంప్ అవుట్ లతో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్రలో 200 మంది క్రికెటర్లను అవుట్‌  ప్రభావితం చేసిన తొలి వికెట్ కీపర్ గా ధోని నిలిచాడు. ధోని 233 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 200 అవుట్‌లను పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. ఇందులో రనౌట్, క్యాచ్ మరియు స్టంపింగ్ అవుట్ లు ఉన్నాయి.

ఎంఎస్ ధోని ప్రస్తుతం ఇలా స్టంప్ అవుట్ చేసిన వారిలో అగ్రస్థానంలో ఉండగా, ఆర్సీబీ వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 218 మ్యాచ్‌లలో 187 అవుట్‌లను చేశాడు.

ఆర్సీబీ మాజీ స్టంపర్ ఏబీ డివిలియర్స్ 140 అవుట్‌లతో మూడవ స్థానంలో ఉన్నారు, రాబిన్ ఉతప్ప, వృద్ధిమాన్ సాహా , పార్థివ్ పటేల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Similar News