నూజివీడు మొనగాడు తానేనని టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు జబ్బ చరచి మరీ చాటుకున్నారు. డేట్ నువ్వు చెప్పినా నన్ను చెప్పమన్నాసరే ఎనీ సెంటర్ ఐ యాం రెడీ అంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకి చాలెంజ్ చేసి మరీ నూజివీడులోని గాంధీ బొమ్మ వద్దకు వచ్చారు ఆయన.
నేనంటే నేనే. సవాల్ కి జవాబు ఇదే అంటూ హల్ చల్ చేశారు. మరి ఆయనతో నియోజకవర్గం అభివృద్ధి మీద చర్చిస్తాను అని చెప్పిన ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆయన అనుచరులు మరో వైపు హడావుడి చేసినాతీరా చూస్తే అలికిడి అయితే లేదని టీడీపీ నేతలు అంటున్నారు.
ఇక అటూ ఇటూ ఇద్దరు నాయకులూ క్యాడర్ మోహరిస్తే శాంతిభద్రతల ఇష్యూ వస్తుందని పోలీసులు రెండు వర్గాల వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ సవాళ్ల సీని ని కూల్ గా మార్చే యత్నం చేసారు. సరే పోలీసుల ప్రయత్నం ఎలా ఉన్నా ముద్దరబోయిన మాత్రం తాను చెప్పిన టైం కి చెప్పిన సెంటర్ కి వచ్చానని అంటున్నారు.
మరి ఇది నిజంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇబ్బందే. చర్చ జరిగినా జరగకపోయినా తాను రెడీ అంటూ ముగ్గులోకి దూకిన మొనగాడుగా ముద్దరబోయిన ఫుల్ మార్క్స్ కొట్టేశారు అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు స్పూర్తితో ఎక్కడికక్కడ టీడీపీ లీడర్లు బాగానే కదులుతున్నారు. అధికార పార్టీని ముగ్గులోకి లాగేస్తున్నారు. మరి ఎన్నికల ముందర ఇలాంటి సీన్లు జనాలలో బాగానే చర్చకు వెళ్తున్నాయి. అధికార పక్షమే సీన్ అంతవరకూ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే విపక్షం ఇలాగే దూకుడు పెంచేస్తుంది అంతే.