కొన్నేళ్ల కిందటి మాట. అప్పటి వరకూ సెల్ ఫోన్ అంటే చాలా కొద్దిమందికి మాత్రమే సంబంధించినట్లుగా ఉండే తీరును రూ.500 సెల్ ఫోన్ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు.. రిలయన్స్ సెల్ ఫోన్ కోసం జనాలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టటం.. కొన్నిచోట్ల అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసిన వైనం మర్చిపోలేం. దేశ చరిత్రలో సెల్ ఫోన్ ను సామాన్యుడికి చేరువ చేయటంలో రూ.500లకే సెల్ ఫోన్ అన్న ఆఫర్ కీలకభూమిక పోషించింది.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మరోసారి ‘జియో’తో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తాను కోరుకున్నట్లే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. 90 రోజుల పాటు కావాల్సినంత డేటా.. అది కూడా 4జీ స్పీడ్ తో. దీనికి తోడు నచ్చినన్ని ఫోన్ కాల్స్ ఫ్రీ గా చేసుకోవచ్చంటూ పరిమిత కాల ఆఫర్ ను రిలయన్స్ ప్రకటించిన నేపథ్యంలో జియో సిమ్ ల కోసం జనాలు బారులు తీరే పరిస్థితి.
జియో కారణంగా 4జీ ఫోన్ల గిరాకీ పెరగటంతో పాటు.. సిమ్ లకోసం క్యూ కడుతున్నారు. రిలయన్స్ డిజిటల్ మొదలుకొని.. రిలయన్స్ షోరూంలలో జియో సిమ్ కోసం విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు.. బంధువులు.. స్నేహితులకు పరిమితం చేసిన ఈ ఆఫర్ ను తాజాగా ప్రజలందరికి అందుబాటులోకి తీసుకురావటం.. మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుండటంతో జియో సిమ్ లను సొంతం చేసుకోవటానికి జనాలువిపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
జనాల్లో జియో మీదున్న క్రేజ్ ను గుర్తించిన కొందరు జియో సిమ్ లను బ్లాక్ మార్కెట్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మొబైల్ షాపుల్లో పరిస్థితి మరోలా ఉంది. 4జీ ఫోన్లు కొంటే జియో సిమ్ లను ఉచితంగా ఇస్తామని ప్రకటించటంతో.. కొత్త ఫోన్లు కొనుగోలు చేసే వారు మొబైల్ షాపులకు పోటెత్తుతున్న పరిస్థితి. తన ఎంట్రీతోనే 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో మార్కెట్లోకి అడుగు పెట్టిన జియో.. తన తాజా ఆఫర్ తో ఆ దిశగా దూసుకెళుతుందన్న మాట మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎంట్రీలోనే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న జియో.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో..?