అంబానీ ఇంట కొత్త మెర్సిడెస్ బుల్లెట్ ప్రూఫ్ కారు.. ధరెంతో తెలిస్తే షాకే!

Update: 2020-08-27 04:00 GMT
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అపర కుబేరుడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు. విలాసవంతమైన ఇళ్లు, గ్యారేజ్  నిండా  కార్లు ఆయన సొంతం. వాళ్ల కుటుంబీకుల ఆడంబరాలు అంతా ఇంతా కావు.  లగ్జరీ లైఫ్ వాళ్ల సొంతం. ఎక్కడికి వెళ్లిన    ప్రత్యేక చార్టెడ్ విమానాలు కూడా వాడుతుంటారు. దేశంలోనే పెద్ద వీఐపీల్లో ఒకరు  కావడంతో అంబానీకి  ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీతో బందోబస్తు కల్పించింది. ఆయన  భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ వాడుతుంటారు. ఎక్కడికి వెళ్లినా ఆ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు.

ప్రస్తుతం ఆయన ఫ్లీట్ లో బీఎండబ్ల్యూ 7 సీరిస్ హై సెక్యూరిటీ మెర్సిడెస్-బెంజ్ ఎస్ -క్లాస్ వాడుతున్నారు. ఇంకా ఆయన గ్యారేజ్ లో ఇటీవలే రూ. 13 కోట్లతో కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 కారు సహా పలు ఖరీదైన కార్లు ఉన్నాయి.  ఇప్పుడైనా మరో ఖరీదైన డబ్ల్యూ 222 మెర్సీడెస్ ఎస్ 600గార్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన కారును  కొనుగోలు చేశారు. దీని ధర సుమారు రూ. 10 కోట్లు. ఇది ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సివిల్ వెహికల్ కారు. బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రతా పరంగా ఎంతో సురక్షితమైనది. ఈ కారు పై గురి పెట్టి కాల్చినా స్టీల్ కోర్ అమర్చి ఉండటం వల్ల  ఏమీ కాదు. రెండు మీటర్ల దూరం నుంచి 15 కిలోల పేలుడు పదార్థంతో పేల్చినా తట్టుకోగల సామర్థ్యం ఉంది.  ఈ కారు బాడీ షెల్ రీఇన్ఫోర్స్ డ్ స్టీల్ తో తయారైంది. 6.0 లీటర్ వీ 12, బీ టర్బో చార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది.
Tags:    

Similar News