అంబానీని వెనక్కి నెట్టిన చైనా కుబేరుడు.. నంబర్​ 2 ప్లేస్​కు రిలయన్స్​ అధినేత..!

Update: 2020-12-31 17:30 GMT
ఆసియా ఖండంలోనే నంబర్​ 1 కుబేరుడిగా ఉన్న రిలయన్స్​ అధినేత ముఖేశ్​ అంబానీ తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. చైనాకు చెందిన వ్యాపారవేత్త జోంగ్ షంషాన్ ముఖేశ్​ అంబానీని వెనక్కి నెట్టేసి.. ఆసియా ఖండంలోనే నంబర్​ వన్​ కుబేరుడిగా నిలిచాడు. జోంగ్ షంషాన్ ఫార్మా వ్యాపారం చేస్తున్నారు. షంషాన్​ కు చెందిన బీజింగ్​ వాంతాయ్​ బయోలాజికల్​ ఫార్మసీ ఎంటర్​ ప్రైజెస్​, నోంగు స్ప్రింగ్ కంపెనీలు ఏ ఏడాది లాభాల బాట పట్టాయి. దీంతో ఈ ఏడాది చివరినాటికి షంషాన్​ ముఖేశ్​ అంబానీని దాటిపోయారు.

ఈ కంపెనీలు ఈ ఏడాది భారీ లాభాలు అందుకున్నాయి. వాంతాయ్​ ఫార్మసీ 155 శాతం లాభాలు నమోదుచేయగా..  నోంగు స్ప్రింగ్ 2000 శాతం లాభాలతో ఎగబాకింది. జోంగ్ షంషాన్‌ నికర ఆదాయం 77.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది ప్రారంభంలో అతని సంపద 70.9 బిలియన్ డాలర్లుగా ఉంది. షంషాన్‌... చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలీబాబా అధినేత జాక్ మాను కూడా అధిగమించాడు. మరోవైపు రిలయన్స్​ స్టాక్​ ఇటీవల పడిపోయింది.  దీంతో ముఖేష్ నికర ఆస్తులు 18.3 బిలియన్ డాలర్లు క్షీణించడంతో 76.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఈ ఏడాది రిలయన్స్ స్టాక్ రూ.2370ని తాకినప్పటికీ ఇప్పుడు రూ.2000 దిగువనే ఉన్నది. దీంతో ఆయన  రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలీబాబా సహ  వ్యవస్థాపకులు జాక్ మా నికర ఆదాయం అక్టోబర్ చివరి నుండి 11 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో 61.7 బిలియన్ డాలర్ల నుండి 50.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరోవైపు షాంసన్​ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో 11 వస్థానంలో ఉన్నారు.
Tags:    

Similar News