కొన్నిసార్లు అంతే.. అనుకోనిరీతిలో కొత్త ఆలోచనలు భారీగా సక్సెస్ కావటం.. దాని కారణంగా వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది. తాజాగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పరిస్థితి అలానే ఉంది. కరోనా దెబ్బతో తొలుత తీవ్ర ప్రభావానికి గురైన ముకేశ్.. చాలా త్వరగా అందులో నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవటమే కాదు.. అందులో సూపర్ సక్సెస్ అయిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ వేళ.. మిగిలిన కంపెనీలకు భిన్నంగా తన ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన జియోలోకి ప్రపంచంలోని ఉద్దండుల చేత వాటాలు కొనిపించటంలో సక్సెస్ అయ్యారు.
దీంతో.. జియో ఆర్థిక పరిస్థితి మారిపోవటమే కాదు.. రిలయన్స్ గ్రూపు మీద ఆ ప్రభావం పడింది. ఫలితంగా కొండలా ఉందనుకున్న అప్పు మంచుముక్కలా కరిగిపోవటమే కాదు.. రిలయన్స్ రుణ రహిత కంపెనీగా అవతరించింది. జియోలో వాటాల అమ్మకం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత.. రిలయన్స్ రిటైల్ రంగాన్ని వ్యూహాత్మకంగా అమ్మకాలకు పెట్టిన ముకేశ్.. ఆ దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పటికే రెండు కంపెనీలకు రిలయన్స్ రిటైల్ లో వాటాల్ని అమ్మిన ముకేశ్.. తాజాగా మరో బుల్లివాటాను అమ్మేయటం హాట్ టాపిక్ గా మారింది.
అంతర్జాతీయ పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ సంస్థకు రిలయన్స్ రిటైల్ లో 0.84 శాతం వాటాను ముకేశ్ విక్రయించారు. ఈ డీల్ విలువ రూ.3675 కోట్లు కావటం గమనార్హం. దీంతో రిలయన్స్ రిటైల్ లోకి మూడో పీఈ పెట్టుబడిగా చెప్పాలి. తొలుత అమెరికన్ పీఈ సంస్థ సిల్వర్ లేక్ కు 1.75 శాతం వాటాను రూ.7500 కోట్లకు అమ్మగా.. మరో అంతర్జాతీయ పీఈ సంస్థ కేకేఆర్ అండ్ కోకు 1.28 శాతం వాటాను రూ.5500 కోట్లకు విక్రయించారు. తాజాగా ఒక శాతం కంటే తక్కువ వాటాను భారీ ధరకు అమ్మేశారు.
ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ మార్కెట్ విలువ రూ.4.28లక్షల కోట్లుగా తేల్చారు. అంతేకాదు.. త్వరలోనే సిల్వర్ లేక్ సహ ఇన్వెస్టర్లు మరో రూ.1875 కోట్లు పెట్టుబడులు రిలయన్స్ రిటైల్ లో పెట్టనున్నట్లుగా సంస్థ పేర్కొంది. దీంతో.. సిల్వర్ లేక్ పెట్టుబడులు రిలయన్స్ రిటైల్ లో రూ.9375 కోట్లకు చేరుకున్నట్లు అయ్యింది. రానున్న రోజుల్లో మరెంతగా విక్రయాల్ని చేపడతారో చూడాలి.