దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నిర్భయ ఉదంతంలో దోషులుగా తేలటం.. వారికి ఉరి విధించటం.. దాన్ని తప్పించుకోవటానికి వారు వేస్తున్న ఎత్తులు.. కోర్టుల్ని ఆశ్రయిస్తున్న తీరు.. అందరిని ఒళ్లు మండేలా చేస్తున్నాయి. సాధారణంగా ఉరిశిక్ష పడిన కేసుల్లో.. ఉరి తీసిన వేళల్లో దోషుల పట్ల అంతో ఇంతో సానుభూతి వ్యక్తం కావటం ఇప్పటికే పలు ఉదంతాల్లో చూశాం. కానీ.. వీరు వేస్తున్న యేషాలు చూస్తే.. వీళ్లకు కోర్టు విధించిన ఉరిని అమలు చేసిన తర్వాత.. దేశంలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఫీల్ అయ్యే ఛాన్సు లేదని చెప్పాలి. ఇంతకాలం భారత కోర్టుల చుట్టూ అప్పీళ్లు మీద అప్పీళ్లు వేసిన వీరు.. తాజాగా అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించటం ఒకటైతే.. ఈ దోషుల్లో మరొకరుడు కోర్టులో ఇంకో పిటిషన్ వేసిన తీరు తెలిస్తే.. మరీ.. ఇంత ముదుర్లా అనుకోకుండా ఉండలేం.
కోర్టు విధించిన ఉరి అమలు చేసేందుకు రోజులు దగ్గర పడుతున్న వేళ.. దీన్నించి తప్పించుకునేందుకు దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ ఉదంతం జరిగిన రోజున తాను అసలు ఢిల్లీలోనే లేనన్నది అతగాడి వాదన. 2012 డిసెంబరు 17న తనను పోలీసులు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారని.. తిహార్ జైల్లో చిత్ర హింసలకు గురి చేసినట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు.
ఉరిశిక్ష అమలును అడ్డుకునేందుకు ఇప్పటికే ఈ కేసులో దోషులైన అక్షయ్ ఠాకూర్.. పవన్ గుప్తా.. వినయ్ శర్మ.. ముకేశ్ సింగ్ లు పలు విధాలుగా ప్రయత్నిస్తూ.. లా పుస్తకాల్లో ఉన్న లొసుగులతో ఉరి వాయిదా పడేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా. మరో కొత్త వాదనతో కోర్టులో పిటిషన్ వేసిన తీరు చూస్తే.. వీరికి శిక్ష అమలు చేస్తే.. ఏ ఒక్కడు ఫీల్ అయ్యే ఛాన్సు లేదని చెప్పాలి. కోర్టు నిర్ణయం ప్రకారం వీరికి ఈ నెల 20న ఉదయం ఐదున్నర గంటలకు ఉరి తీయాల్సి ఉంది. ఇందుకుసంబంధించిన డెత్ వారెంట్లు ఇప్పటికే జారీ అయ్యాయి. తాజాగా.. దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఏ రీతిలో స్పందిస్తుందో చూడాలి.