ఫొక్సో (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్) కేసులో ఓ నిందితుడికి అనుకూలంగా ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగికవాంచ లేకుండా స్త్రీలను లేదా బాలికలను తాకితే తప్పులేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ ఫొక్సోకేసులో బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ భారతి డాంగ్రే సంచలన తీర్పు వెలువరించారు. దేశవ్యాప్తంగా స్త్రీలపై అగయిత్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తివివరాలేమిటో చూద్దాం..
మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతికి చెందిన ఓ యువకుడి(27).. తన ఇంటికి సమీపంలో ఉండే ఓ బాలిక(17) ను ప్రేమపేరుతో వేధించేవాడు. ఒక రోజు బాలిక స్కూల్‌కు వెళ్తుండగా.. ఆమె చేతిని పట్టుకొని తనను ప్రేమించాలని పట్టుబట్టాడు. దీంతో బాలిక ఆ యువకుడిని తప్పించుకొని ఇంటికి వెళ్లింది. సదరు యువకుడు చాలా సార్లు ఆ బాలికను వేధించాడు. మొబైల్ నుంచి మెసేజ్‌లు కూడా పంపించాడు. అంతేకాకుండా బాలికపేరుతో ఓ ఇన్‌స్టా అకౌంట్ తెరిచాడు. ఆమె అతడిని ప్రేమిస్తున్నట్టు స్నేహితులను నమ్మించేందుకు ఓ ఫేక్ ఇన్‌స్టాతో మెసేజ్‌లు పంపించుకున్నాడు. వాటి స్క్రీన్షాట్లు తీసి సోషల్‌మీడియాలో పెట్టాడు. తన స్నేహితులకు పంపించాడు.
దీంతో బాలిక తండ్రి .. సదరు యువకుడిని మందలించగా.. అతడిని కూడా బెదిరించాడు. అంతేకాక నిత్యం వివిధ రకాలుగా బాలికను వేధించేవాడు. దీంతో సదరు బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికపై ఫోక్సో కేసు పెట్టారు. అయితే సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. అతడు బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోగా జిల్లా కోర్టు నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది.
అయితే నిందితుడి తరఫు లాయర్ కోర్టులో వాదిస్తూ.. ‘ నా క్లయింట్‌పై ఫోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద కేసుపెట్టారు. ఈ చట్టం ప్రకారం లైంగికవాంఛతో తాకితేనే నేరం. కానీ నా క్లయింట్ లైంగిక కోరికతో బాలికను తాకలేదు. కేవలం తన ప్రేమను వ్యక్తం చేయడానికి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇది నేరం ఎలా అవుతుంది’ అంటూ జడ్జీ ముందు తన వాదనను వినిపించాడు. లాయర్ వాదనతో హైకోర్టు జడ్జి జస్టిస్ భారతి డాంగ్రే ఏకీభవించారు. సదరు యువకుడు కింద ఫోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద కేసు పెట్టడం సరికాదని జస్టిస్ భారతి పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చారు.