ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటే.. ప్రపంచంలో ప్రతిదీ వ్యాపారమే. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు.. పుట్టుక నుంచి చావు వరకు ప్రతిది వ్యాపారమే. అలాంటి వ్యాపారాల్లో కొన్ని చాలా వినూత్నంగా ఉంటాయి. మరికొన్ని ఊహకు అందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయేది ఆ కోవకు చెందినదే.
ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో మాదిరి స్టార్టప్ కంపెనీలు వేగంగా డెవలప్ అవుతున్నాయి. అలా డెవలప్ అవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలోఉంది. ఇదిలా ఉంటే.. ముంబయికి చెందిన ఒక స్టార్టప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వ్యాపారం కూడా చేస్తారా? అన్న విస్మయాన్ని వ్యక్తమవుతోంది.
సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్టార్ట చేసిన ఈ కంపెనీ.. మనిషి చివరి అంకమైన చావును తమ బిజినెస్ మోడల్ గా మార్చుకుంది. ఈ కంపెనీ అవసరమైన కర్మ కాండల్ని.. అంబులెన్స్ సర్వీసుతో పాటు.. డెత్ సర్టిఫికేట్ పత్రాలు పొందటానికి సాయం చేస్తుంది. తాజాగా ఒక ఐఏఎస్ అధికారి ఈ కంపెనీ గురించి ప్రస్తావిస్తూ.. ఇలాంటి స్టార్టప్ అవసరం మనకు ఉందా? అని ప్రశ్నించారు.
దీనికి నెటిజన్లు కాస్తంత భిన్నంగానే రియాక్టు అవుతున్నారు. తాము ఈ తరహా సేవల గురించి విన్నామని.. ఇప్పుడు చూస్తున్నామని చెబితే.. మరికొందరు భవిష్యత్తు అవసరాలకు ఇది అవసరమేఅని బదులిస్తున్నారు. భారత్ లో ఈ తరహా సేవలు కొత్త ఏమోకానీ.. అమెరికాలో ఎప్పటినుంచో ఇలాంటివి అందుబాటులో ఉన్నాయని మరొకరు పేర్కొన్నారు.
మనిషి చివరి రోజుల్లోఎవరూ పట్టించుకోకుండా కొందరు ఉంటారని.. అలాంటి వారికి వీటి అవసరం చాలానే ఉందన్నారు. ఇక.. ఈ కంపెనీ తాను అందించే కర్మకాండల సర్వీసు కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తుందని చెబుతున్నారు.
అన్ని వ్యాపారమే అయినప్పడు.. చావును కూడా వ్యాపారంగా మార్చేయటం వినూత్నంగా ఆలోచించటమే.కొత్త సర్వీసుల్ని ప్రజలకు అందుబాటులోకి తేవటమే అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.