వైసీపీ అనుచరుల ఆగడాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి నిజమైనవా? లేక ఫేక్ వా? ఎవరైనా ప్రత్యర్థులు సృష్టించినవా? ఖచ్చితంగా తెలియకపోవడంతో జనాలు కొందరు నమ్ముతున్నారు.. కొందరు ఇదంతా అవాస్తవాలు అంటున్నారు. అయితే వీడియోలు మాత్రం వైసీపీపై నెగెటివ్ ప్రచారానికి అస్త్రాలుగా మారుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం ప్రకాషం జిల్లా వైసీపీ కార్యకర్త, మంత్రి అనుచరుడు సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ నేత దాడిచేసినట్టు ఒక వీడియో వైరల్ అయ్యింది. అది అధికార పార్టీపై ప్రతిపక్షాల విమర్శలకు కారణమైంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ రఘు ఏకంగా తన తల్లి సరోజపై దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చైర్మన్ తల్లి సరోజా కూడా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్. ఆస్తి గొడవలతోనే తల్లిపై మున్సిపల్ చైర్మన్ దాడి చేసినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజాగా మున్సిపల్ చైర్మన్ అయిన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఎస్పీలకు తల్లి సరోజా ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో వెలుగుచూసింది. తమ ఇంటికొచ్చి కుమారుడు రఘు.. తమపై, కుటుంబసభ్యులపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చిక్కుల్లో పడ్డాడు. సొంత తల్లిని అతడు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Full View