ఆగిన చోట నుంచే మున్సిపోల్స్..ప్రభుత్వం కీలక ఆదేశాలు - హైకోర్టు తీర్పు పై ఉత్కంఠ!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలను గతంలో ఆగిన చోట నుంచే తిరిగి నిర్వహిస్తామని ఇప్పటికే ఎస్ఈసీ ప్రకటించగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. . గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆగిన చోట నుంచే ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండగానే ప్రభుత్వం ఈ ఆధేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే .. రాష్ట్రంలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 10న పోలింగ్ నిర్వహించి, మార్చి 14న ఫలితాలు వెల్లడిస్తారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచి కొనసాగించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ దశలో ఉండగా కరోనా ప్రబలడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
అయితే, కరోనా కారణంగా ఆగిన ఎన్నికల ప్రక్రియను ఆగిన చోట నుంచి తిరిగి ప్రారంభించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ పూర్తయి తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం అధికారులను ఎన్నికల ప్రక్రియను ఆగిన చోట నుంచే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. పురపాలకశాఖ అధికారులు పోలింగ్ సామాగ్రి, నామినేషన్ పత్రాలను స్టోర్ రూమ్‌ల నుంచి బయటికి తీయాలని ఆదేశాలు పంపారు. గతంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మార్చి 2న ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సిద్ధమౌతోంది. అయితే , ఈలోపు హైకోర్టు ప్రత్యేకంగా ఏదైనా ఆదేశం ఇస్తే తప్ప మున్సిపల్ పోరు ఇప్పటికే ఎస్ ఈ సీ ప్రకటించిన విధంగా జరిగిపోతుంది అని స్పష్టంగా తెలుస్తుంది.
అయితే ఎన్నికల ప్రక్రియ పై కోర్టులో దాఖలైన పిటిషన్ల పై విచారణ ముగిసినా హైకోర్టు తీర్పు మాత్రం ఇంకా రిజర్వులోనే ఉంది. ఆ లోపు కొత్త పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయి. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ పోరులో నామినేషన్ కు అవకాశం ఇవ్వాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరికొందరితో కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే వీరి విజ్ఞప్తుల్ని హైకోర్టు అంగీకరించపోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ పై ముందుకు వెళ్తుంది. అయితే చివరి నిముషంలో కోర్టు ఏమైనా అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం టెన్షన్ తప్పదు. అందుకే సోమవారం హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.