ఆలయ స్తంభాల్లో సప్తస్వరాలు.. రాజుల కళాత్మకతకు సాక్ష్యాలు

Update: 2020-10-19 23:30 GMT
భారత దేశం.. కళలకు నిలయం. పూర్వీకులు కళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఆనాడు వారు అవలంబించిన, కొనసాగించిన కళలు. మన దేశానికి ప్రపంచంలోనే ఒక విశిష్టతని తెచ్చాయి. పూర్వీకుల కళల్లో  శిల్పకళా నైపుణ్యం ప్రముఖమైనది. అందులోనూ సప్త స్వరాలు పలికే శిల్పాల సృష్టి అబ్బురమనే చెప్పాలి. మన దేశంలో వందలు, వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు సప్తస్వరాలనుపలికిస్తున్నాయి. ముఖ్యంగా ఇటువంటి గుడులు దక్షిణభారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజుల్లో మన దేశాన్ని పరిపాలించిన రాజులు ఎంత కళాదృష్టితో వీటిని నిర్మించారో తెలుసుకొంటే ఆశ్చర్యం కలుగక మానదు.

 దాదాపు వెయ్యేళ్ల  క్రితం నిర్మించిన ఆలయాల్లోని రాతి స్తంభాల నుంచి కొన్ని రకాల సంగీతం వినిపిస్తుంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో  ఈ తరహా ఆలయాలు చాలా  ఉన్నాయి. దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజులు సంగీత ప్రియులు. సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో  ఆలయాల్లో  మ్యూజికల్ పిల్లర్స్ ఏర్పాటుచేశారు. రాజులు దేవాలయానికి వెళ్లి అక్కడి విద్వాంసులు చేసే కచేరీలను, నాట్యాలను తిలకించేవారు.  సంగీతం ఆది ప్రణవనాదం నుంచి ఉద్భవించిందని  సంగీత విద్వాంసుల నమ్మకం.

 రాతిని తాకితే సరిగమపదనిస స్వరాలు వచ్చే స్తంభాలు  భారతదేశంలో నిజంగా అద్భుతమనే చెప్పాలి. హంపిలోని ఆలయాల్లో సంగీతస్వరాలు పలికించే స్తంభాలు  ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్​ జిల్లా  రామప్ప దేవాలయం ఇక వరంగల్ జిల్లా రామప్ప దేవాలయంలో ఆలయ మండపంలో కుడివైపు సప్తస్వరాలు పలికించే సంగీత స్తంభం  వుంది.

 తమిళనాడులోని మధుర మీనాక్షిఆలయంలోనూ,  కన్యాకుమారి సమీపంలో ఉన్న సుచింద్రంలోని స్థాయేశ్వర దేవాలయంలోనూ,  కాంతిమతి అంబాల్ దేవాలయ మండపం దగ్గర కూడా సప్తస్వరం పలికే స్తంభాలు ఉన్నాయి.  ఆళ్వార్ తిరునగర్ లో ఆదినాథ స్వామి ఆలయంలోని స్తంభం నాదస్వరం పలికిస్తుందని సంగీత విద్వాంసులు చెబుతున్నారు.తంజావూరులోని బృహదీశ్వరఆలయంలో, కుంభకోణం దగ్గర సుబ్రమణ్యస్వామి ఆలయంలో కూడా సప్తస్వర పలికించే స్తం భాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో రాజ్ మహల్ లో, మహారాష్ట్రలోని ఎల్లోరా జైనదేవాలయంలో ఈ సప్తస్వరాలు పలికించే స్తంభాలు వుండటం విశేషం.
Tags:    

Similar News