ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకిన మస్క్ ... మొత్తం సంపద ఎంతంటే ?

Update: 2020-11-24 11:50 GMT
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ గత కొన్ని రోజులుగా ఆదాయాన్ని ఆర్జించడంలో చాలా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఈ మద్యే ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకర్ ‌బర్గ్‌ ను దాటి ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి వచ్చారు. తాజాగా అయనతాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌ను అధిగమించి, ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరారు. ఎలాన్ సంపద 7.2 బిలియన్ డాలర్లు పెరిగి 127.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో  మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ 127.7 బిలియన్ డాలర్లు ను దాటేశారు.

ఇకపోతే , ఈ ఏడాది ప్రారంభంలో 35వ స్థానంలో ఉన్న మస్క్  ఏకంగా రెండో స్థానానికి చేరారు. మస్క్ సంపద ఏడాదిలో 100.3 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్ ‌బర్గ్ నివేదిక ప్రకారం 49 ఏళ్ల ఎలాన్ మస్క్ అందరు బిలియనీర్ల కంటే ఈ ఏడాది ఎక్కువగా ఆర్జించారు. జనవరిలో బ్లూమ్‌ బర్గ్ ప్రకటించిన ప్రపంచ 500 మిలియనీర్లలో అతను 35వ స్థానంలో ఉన్నాడు. కొద్ది నెలల క్రితం టాప్ 10లోకి వచ్చాడు. నవంబర్ నెలలో 3 వ స్థానంలోకి , ఇప్పుడు 2వ స్థానంలోకి వచ్చాడు. టెస్లా రాణించడంతో అతని సంపద అమాంతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్ డాలర్లను తాకింది.

 ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాని కంటే దిగువన ఉండటం బిల్ గేట్స్‌ కు గత ఎనిమిదేళ్లలో ఇది రెండోసారి మాత్రమే. 2017లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. గేట్స్ ‌ను దాటి మొదటి స్థానంలోకి వచ్చారు. గేట్స్ సంపదలో ఎక్కువమొత్తం దాతృత్వ కార్యకలాపాలకు వినియోగిస్తారు.  అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 180 బిలియన్ డాలర్లకు పైగా సంపాదనతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.
Tags:    

Similar News