ఆయనో ఎమ్మెల్యే. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధి గా సుపరిచితుడే కాదు.. తన గురించి తాను తరచూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. జనగామ కు రాజుగా తనను తాను అభివర్ణించుకునే ఆయనే.. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అలాంటి ఆయన్ను.. సొంత కుమార్తె బహిరంగంగా అందరి ముందు మాటల తో కడిగేయటమే కాదు.. ఆధారాలు చూపించి అందరిని అవాక్కు అయ్యేలా చేసిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
జనగామ శివారు లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తిరిగి వెళ్లే సమయంలో అక్కడ కు చేరుకున్నారు ఆయన కుమార్తె భవానీ రెడ్డి.. అల్లుడు. తండ్రి వద్దకు వచ్చిన భవానీ.. 'జనగామకు రాజువని చెబుతుంటావు కదా. నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ ఈ తప్పుడు పనులేంది నాన్న. చేర్యాల పట్టణంలో 1200 గజాల భూమిని నా పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేశావు. అక్కడ నేను ఎలాంటి భూమి కొనలేదు. రిజిస్ట్రేషన్ రోజు ఒక్క పేపర్ మీదే సంతకం చేశారు. అది కూడా నన్ను ఒత్తిడి పెట్టి తీసుకున్నారు' అంటూ అందరి ఎదుట నిలదీసిన వైనం షాకింగ్ గా మారింది.
నువ్వు చేసే తప్పుడు పనుల కారణంగా నేను కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న ఆమె ఆందోళన కు స్పందించిన ముత్తిరెడ్డి.. ఫోర్జరీ సంతకం అంటున్నావు కదా? అదంతా ప్రభుత్వం చూసుకుంటుందమ్మా. ఇప్పటికే నా పై ఒక కేసు పెట్టావు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తన కుమార్తెను తన మీద కు తన రాజకీయ ప్రత్యర్థులు ఉసిగొల్పుతున్నట్లుగా ముత్తిరెడ్డి ఆరోపించారు.రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు తన కుమార్తె ను తన మీదకు ప్రయోగిస్తున్నారన్న ముత్తిరెడ్డి నోటి నుంచి మరో ఆసక్తికర వ్యాఖ్య రావటం గమనార్హం.
గతంలో తన పై కలెక్టరే ఆరోపణ చేసినా.. ఎవరూ ఏమీ చేయలేకపోయారని.. తన పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకం ఉందన్నారు. ముత్తిరెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి తీరు ప్రభుత్వాన్ని దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గత నెల తొమ్మిదిన ఒక హోటల్ లీజు కు సంబంధించిన ఇష్యూలో తన సంతకాన్ని తన తండ్రి ఫోర్జరీ చేశారంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో.. ముత్తిరెడ్డి కుమార్తె కంప్లైంట్ చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. తాజా నిలదీత.. రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసింది.