ఇస్లామిక్ స్టేట్ భావజాలానికి లోనై వారి పన్నిన పన్నాగంలో భాగస్వామ్యమై.. హైదరాబాద్ లో మహా విద్వంసానికి ప్లాన్ చేసిన ఐదుగురు ఐఎస్ సానుభూతి పరుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఇదే సమయంలో కేరళకు చెందిన కొందరు యువకులు మిస్ కావటం కలకలాన్ని రేపింది. అలా మిస్ అయిన వారిలో ఒకరు 22 ఏళ్ల హఫీసుద్దీన్. అతగాడు ఇస్లామిక్ స్టేట్ లోకి వెళ్లిపోయినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అతగాడి తండ్రి అబ్దుల్ హకీమ్ ను మీడియా కలిసింది.
ఈ సందర్భంగా తన కొడుకు గురించి షాకింగ్ విషయాల్ని చెప్పుకొచ్చాడు ఆ తండ్రి. తనను ఒకప్పుడు అబ్బజాన్ అని పిలిచే కొడుకు ఈ మధ్యన కఫీర్ (దేవుడ్ని వ్యతిరేకించే వ్యక్తి) అని పిలవటం మొదలెట్టాడని.. తన కొడుకు తీవ్ర భావజాలానికి గురైనట్లుగా ఆ తండ్రి వాపోయాడు. తన కొడుకు పూర్తిగా మారిపోయినట్లు చెప్పిన ఆ తండ్రి.. ఈ మధ్యన తన కొడుకు తనకు పెట్టిన ఒక మెసేజ్ గురించి వివరిస్తూ.. ‘‘నాకిప్పుడు స్వర్గం దొరికింది. అందులో పన్నులు లేవు. ప్రత్యేక షరియా చట్టం లేదు. ఇక్కడ నన్నెవరూ పట్టుకునే వారు లేరు. నిజంగా ఇది చాలా మంచి చోటు అని రాశాడు’’ అని చెప్పారు.
తన కొడుకు భారతదేశానికి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే నా కొడుకు అయినా తనకొద్దని.. తన కొడుకు శవాన్ని కూడా చూడనని తేల్చి చెప్పారు. ‘‘ఈ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తే నా కొడుకైనా నొకొద్దు. నేను భారతీయుడ్ని. ఒక భారతీయుడిగా ఈ దేశానికి వ్యతిరేకంగా పని చేసే వాడు నాకొద్దు. వాడి శవాన్ని కూడా చూడను. భారతీయుడిగా శవాన్ని కూడా చూడాలనుకోను’’ అని చెప్పారు. తన కొడుకు అసలు అలా ఎలా మారాడన్నది తనకు అర్థం కావటం లేదని వాపోతున్నాడా తండ్రి. కన్నవారి కడుపు కోతకు గురి చేసే కొడుకును ఆ దేవుడు సైతం క్షమిస్తాడా..?