కొన్ని గంటల్లో అమెరికా విమానం ఎక్కాల్సిన వ్యక్తి.. నీళ్ల కుంటలో శవమై తేలాడు. తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూడడానికి వెళ్లిన ఎన్నారై డాక్టర్ చనిపోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ఈ ఉదయం అదృశ్యమైన డాక్టర్ జయశీల్ రెడ్డి నల్లగొండ నీట కుంటలో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మేలదుప్పలపల్లికి చెందిన జయశీల్ కి ఎన్నారై డాక్టర్ అనే పేరుంది. జమైకాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన జయశల్ కి మేలదుప్పలపల్లిలో ఫామ్ హౌస్ ఉంది. నిన్న ఫామ్ హౌస్ కు వెళ్లాడు డాక్టర్ జయశీల్. అక్కడి నుంచి సింగిల్ గా సెల్ఫీలు, వీడియోలు తీసుకొని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపాడు.
ఆ తర్వాతే జయశీల్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. రేపు సాయంత్రం అమెరికా వెళ్లాల్సిన డాక్టర్ జయశీల్ ఫాంహౌస్ కు వెళ్లిన కొన్ని గంటల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని జయశీల్ ఫాంహౌస్ కు చేరుకున్నారు. అక్కడ వరద నీరు ఉండడంతో జయశీల్ రెడ్డి గల్లంతైనట్టు అనుమానించి గాలించారు.
ఫాంహౌస్ లో ఉన్న బావిలో పడిపోయి ఉండవచ్చన్న అనుమానంతో నీటిని తోడారు. అయితే ఎన్నారై డాక్టర్ డెడ్ బాడీ చివరకు నల్లగొండ జిల్లా మేళ్ల దుప్పలపల్లి దగ్గరలోని ఓ నీటికుంటలో లభ్యమైంది. జయశీల్ రెడ్డి స్వయానా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోదరుడు కావడం గమనార్హం. జయశీల్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదమా? లేక హత్యనా? అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.