మిస్టరీ ‘స్తంభాలు' .. తాజాగా స్పెయిన్ లో ప్రత్యక్షం , అసలేంజరుగుతోంది !
మోనోలిత్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త. రోజుకో చోట ప్రత్యక్షమవుతున్న ఈ లోహ స్తంభం. మేథావులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎవరైనా కావాలని చేస్తున్న పనా, లేదా ఏలియన్స్ సంకేతమా అనేది అర్థం కాక అంతా జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటివరకు ఈ మోనోలిత్ చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది. తొలుత ఈ మోనోలిత్ అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించింది. ఉటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్‌కు చెందిన సిబ్బంది హెలికాప్టర్‌లో వెళ్తుండగా.. ఎడారిలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించింది. దాని వద్దకు వెళ్లి పరిశీలించగా.. త్రికోణంలో ఉన్న ఎత్తైన స్తంభం కనిపించింది. అయితే, అది ఎవరు ఎప్పుడు ఎలా ఏర్పాటు చేశారనే విషయంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కనీసం రవాణా సదుపాయం కూడా లేని ఆ ప్రాంతంలోకి అంత బరువైన స్తంభాన్ని ఎలా తెచ్చారనేది అప్పట్లో మిస్టరీగా మారింది.ఎంతో నునుపుగా.. మెరుస్తున్న ఈ మోనోలిత్‌ను తర్వాతి రోజు కొంతమంది వ్యక్తులు అక్కడి దాన్ని తొలగించారు. దీంతో.. దాన్ని ఎవరో కావాలనే ఏర్పాటు చేసి ఉంటారని భావించారు.ఆ తర్వాత ఇలాంటి స్తంభం కాలిఫోర్నియా, రోమానియాలో ప్రత్యక్షం కావడం గమనార్హం. ఆ తర్వాత ఇంగ్లాండ్ లోని ఐల్ ఆఫ్ వైట్ లో , ఫ్రైస్ ల్యాండ్ లో ప్రత్యక్షం అయింది. తాజాగా స్పెయిన్ సగోవియన్ చర్చి సమీపంలో మోనోలిత్ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ స్తంభం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు.
ఈ స్థంబాలు ఏర్పుడుతున్న ప్రాంతాలు కూడా ఆసక్తికరంగా మారాయి. మానవ సంచారం లేని చోటనే ఈ దిమ్మెలు ప్రత్యక్షమవుతున్నాయి. ఒకవేళ వాటిని మనుషులే పాతిపెడితే.. అక్కడి వరకు వాటిని ఎలా రవాణా చేశారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మోనోలిత్‌లను ఏర్పాటు చేస్తోంది ఎవరు, ప్రజలు ఊహిస్తున్నట్లు నిజంగానే ఇది గ్రహాంతరవాసుల పనా, లేదా ఏదైనా ‘ఆర్ట్’ ప్రమోషనా, దీనిపై మీరేమంటారు.