ఏపీలో జరిగిన ఎన్నికల్లో దారుణమైన పరాజయం తర్వాత.. ఆ ఓటమిని తాను కేవలం పావుగంటలో అధిగమించినట్లుగా చెప్పుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఫలితాలు వచ్చిన తొలి వారంతో పార్టీ సమావేశాలతో హడావుడి చేసిన జనసేనాధినేత.. తర్వాత కామ్ గా ఉండటం తెలిసిందే. కొద్దిరోజులకే అమెరికా పర్యటనకు వెళ్లిరావటం.. ఇతర పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారే కానీ.. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పెద్దగా స్పందించింది లేదు.
ఇదిలా ఉంటే.. దారుణ పరాజయాన్ని పావుగంటలో పవన్ అధిగమిస్తే.. ఆయన సోదరుడు నాగబాబుకు మాత్రం చాలా ఎక్కువ సమయమే పట్టినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నాగబాబు.. ఆ తర్వాత నియోజకవర్గంలో పర్యటించటం.. జనసైనికుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
ప్రజారాజ్యం సమయంలో తాను ఎన్నికల బరిలో నిలిచిన నియోజకవర్గంలో ఓటమిపాలైన తర్వాత అల్లు అరవింద్ ఆ నియోజకవర్గాన్ని పట్టించుకున్నది లేదు. దీనికి భిన్నంగా నాగబాబు మాత్రం నరసాపురం నియోజకవర్గంలో పర్యటించటం.. అక్కడి క్యాడర్ కు భరోసా ఇవ్వటం.. భవిష్యత్ మనదేనన్న ధీమాను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికిరాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన మాత్రమే నిలుస్తుందని హుషారు పుట్టించే మాటలు చెబుతున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన సింగిల్ గా కంటే కూడా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగి మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు. ఈ లోటును తీరుస్తూ తాజాగా నాగబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాము ఎవరితోనూ.. ఏ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకునేది లేదని తేల్చేశారు. తాము సింగిల్ గానే ఎన్నికల్ని ఎదుర్కొనున్నట్లు చెప్పారు.
రాబోయే రోజుల్లో నెలలో వారం రోజులు నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చిన ఆయన.. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిపై పోరాడనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి డీలా పడొద్దని.. రాబోయే రోజులన్ని జనసేనవే అంటూ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎన్నికల్లో పొత్తులకు ఏ మాత్రం అవకాశం లేదని.. సింహం సింగిల్ గా అన్నట్లు పవన్ పార్టీ సోలోగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న మాటను నాగబాబు స్పష్టం చేసినట్లు చెప్పాలి.