మెగా బ్రదర్ నాగేంద్ర బాబు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదనే చెప్పాలి. తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పేరిట పార్టీ పెట్టి... ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇటీవలే సోషల్ మీడియాలో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు... తనదైన శైలి సెటైర్లతో ఓ ఆటాడేసుకుంటున్నారు. తమ కుటుంబంతో పాటు తన సోదరులపై గతంలో కామెంట్లు చేసిన వారందరినీ ఒక్కరొక్కరుగానే, విడివిడిగానే ఎక్కేస్తున్న నాగబాబు... తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపైనా ఎక్కి దిగేశారనే చెప్పాలి. తనదైన శైలి సెటైరికల్ వీడియోను విడుదల చేసిన నాగబాబు... ఇక చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. 70 ఏళ్ల వయసున్న నేతగా చంద్రబాబుపై కనికరం చూపుతున్నట్లుగానే నటిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన నాగబాబు.... టీడీపీ నేతలను గుల్ల చేసేశారని చెప్పక తప్పదు. యూట్యూబ్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో చంద్రబాబుపై నాగబాబు తనదైన శైలిలో ఓ ఆట ఆడుకున్నారనే చెప్పాలి. ఆద్యంతం హాస్యరసం పండిస్తూనే నాగబాబు వేసిన సెటైర్లు ఇప్పుడు వైరల్‌గానూ మారిపోయాయి.
సదరు వీడియోలో నాగబాబు తన సెటైర్లను ఎలా సంధించారన్న విషయానికి వస్తే... *ఈసారి మా చంద్రబాబుకు మేం విశ్రాంతి ఇచ్చే తీరతాం. తన మనవడు దేవాన్ష్ తో ఆడుకునే అవకాశం కల్పిస్తాం. అందరూ హాయిగా విశ్రాంతి తీసుకోవాలి కానీ చంద్రబాబు మాత్రం పగలు రేయి తేడాలేకుండా కష్టపడాలి! ఇదేమన్నా న్యాయంగా ఉందా! ఈ వయసులో మనవడితో ఆడుకోవాలని ఆయనకు మాత్రం ఉండదా ఏంటి! 70 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుపై ప్రజలకు జాలి దయా లేవా? ఉంటే ఆయన్ని ఎందుకిలా కష్టపెడతారు? మళ్లీ మా చంద్రబాబే రావాలి అంటూ ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతారు? ఈమధ్యే లోకేశ్ ఓ మాటన్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా మా నాన్న చాలా కష్టపడుతున్నాడని అన్నాడు. ఒక కొడుకుగా లోకేశ్ బాధపడడంలో తప్పులేదు. అందుకే మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారికి విశ్రాంతి ఇస్తాం. తాత దగ్గర ఎలా ఆడుకోవాలో దేవాన్ష్ కూడా తెలుసుకోవాలి కదా! మళ్లీ బాబే రావాలి అని ఎవరైనా కోరుకుంటే వాళ్లకి ఒకటే చెబుతున్నాం... మేం ఆయనకి తప్పకుండా రెస్ట్ ఇచ్చి తీరుతాం, ఆయన్ని మళ్లీ రానివ్వం" అంటూ నాగబాబు ఆ వీడియోలో తనదైన శైలి సెటైర్ల వర్షం కురిపించారు.