నరసాపురం లెక్కలు: నాగబాబు గెలుస్తాడా?

Update: 2019-04-13 08:18 GMT
ఈసారి జరిగిన ఏపీ ఎన్నికల్లో హింస పెచ్చరిల్లింది. అదే సమయంలో భారీ పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే భారీగా అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. సామాజికవర్గాల వారీగా విడిపోయి ఓటర్లు ఓట్లు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో నష్టమెవరికి.? లాభమెవరికి అన్న లెక్కలు వేస్తున్నాయి రాజకీయ పార్టీలు..

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన ఓటర్లకు భారీ ఎత్తున వలవేశారని తెలిసింది. వారు అసెంబ్లీకి ఒకరికి.. పార్లమెంట్ కు మరొకరికి ఓటు వేసినట్లు చెబుతున్నారు. ఇది ఫలించినట్టు సమాచారం.

ఏపీ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి రావడంతో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు ఎంపీ అభ్యర్థులు భయపడిపోతున్నారు. రాజమండ్రి ఎంపీ సీటులోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఇలా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని సమాచారం. వైసీపీ ఎంపీ అభ్యర్థి బీసీ వర్గం కావడం.. బలహీన వర్గం కావడంతో ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించారన్న వార్తలొస్తున్నాయి. ఇక్కడ కొన్ని జనసేన అభ్యర్థి ఆకుల సత్యనారాయణకు పడ్డట్టు సమాచారం.  

ఏలూరు లోక్ సభ పరిధిలోనూ వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ కు కాకుండా టీడీపీ ఎంపీ మాగంటి బాబుకే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పడిన ఓట్లు.. క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి.

ఇక ముక్కోణపు పోరు ఉన్న నరసాపురంలో ఎంపీ సీటులో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. ఇక్కడ జనసేన నుంచి పవన్ అన్నయ్య నాగబాబు బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పడిన ఓట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థి శివరామరాజుకు పడినట్లు సమాచారం. ఇక జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు కొన్ని నియోజకవర్గాల్లో గంపగుత్తగా ఓట్లు పడినట్లు సమాచారం. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజుకు సైతం జనసేన, టీడీపీ లో ఉన్న వారు క్రాస్ ఓటింగ్ తో ఓట్లు వేసినట్లు సమాచారం. ఇలా నరసాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసిన ఓట్లు.. ఎంపీకి వచ్చేసరికి మరో పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం నాగబాబుకు కలిసి వస్తుందని అంటున్నారు.. వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల చీలిక జనసేనకు లాభిస్తుందని అంటున్నారు.. చూడాలి మరి..
Tags:    

Similar News