'అర‌వింద' టికెట్ల రాజ‌కీయం వెనుక ఆ ఎమ్మెల్యే?

Update: 2018-10-11 10:51 GMT
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల కాంబోలో తెర‌కెక్కిన `అర‌వింద స‌మేత‌` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఏపీ స‌ర్కార్ ప్ర‌త్యేక స‌డ‌లింపులు కూడా ఇచ్చింది. ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల‌వర‌కు షోలు వేసుకునేందుకు అనుమ‌తించింది. అయితే, అనూహ్యంగా ఈ చిత్రం టికెట్ల వ్య‌వ‌హారం రాజ‌కీయ‌మైంది. ఆ సినిమా టికెట్ల విష‌యంలో నందమూరి అభిమానులు - టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. నందమూరి కల్చరల్‌ యూత్‌ అసోసియేషన్ - బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు - అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుల‌కు ఓ థియేట‌ర్ యాజ‌మాన్యం ఆ సినిమా టికెట్లు ఇచ్చేందుకు నిరాక‌రించింది. అంతేకాకుండా, ఈ వ్య‌వ‌హారం వెనుకు టీడీపీ ఎమ్మెల్యే అనిత హ‌స్త‌ముంద‌ని వ‌దంతులు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

రాంబాబు - శ్రీ‌నులు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉన్నారు. కానీ, కొద్ది రోజులుగా రాంబాబు పార్టీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉంటుండ‌గా...శ్రీను వైసీపీలో చేరారు. కానీ, నంద‌మూరి ఫ్యామిలీ హీరోల‌పై అభిమానం అలాగే ఉంది. వారి సినిమాల విడుద‌ల స‌మ‌యంలో హ‌డావిడి కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో పాయకరావుపేటలో సాయిమహల్‌ థియేటర్‌ లో `అర‌వింద స‌మేత‌` చిత్రం చూసేందుకు రాంబాబు - శ్రీ‌ను త‌న అనుచ‌రుల‌తో వెళ్లారు. కానీ, వారికి టికెట్లు ఇచ్చేందుకు థియేట‌ర్ యాజ‌మాన్యం నిరాక‌రించింది. వారిద్ద‌రూ వైసీపీకి చెందినవారు కావడంతో టికెట్లు ఇవ్వ‌ద్ద‌ని టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పారని యాజ‌మాన్యం తెలిపిందని తెలుస్తోంది. దీంతో - థియేట‌ర్ యాజ‌మాన్యం - అనితల తీరుపై రాంబాబు - శ్రీ‌నులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. థియేట‌ర్ ద‌గ్గ‌ర ఉన్న ఫ్లెక్సీలు - బ్యాన‌ర్ల‌ను వారి అనుచ‌రులు చింపిన‌ట్లు తెలుస్తోంది.రాజ‌కీయాలు - సినిమా వేర‌ని....తాము ఎప్ప‌టికీ నంద‌మూరి ఫ్యామిలీ అభిమానుల‌మేన‌ని వారిద్ద‌రూ చెప్పారు. పోలీసులు థియేట‌ర్ కు చేరుకొని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.
Tags:    

Similar News