బాబుతో మీటింగ్‌...100% క్లారిటీ ఇచ్చేసిన శిల్పా

Update: 2017-04-19 19:27 GMT
నంద్యాల ఉప ఎన్నిక రాజ‌కీయం తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరింది. ఈ ఉప ఎన్నిక‌లో తామంటే తాము బ‌రిలో ఉంటామ‌ని ఇటు శిల్పా బ్ర‌ద‌ర్స్...అటు భూమా కుటుంబ స‌భ్యులు ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయిన శిల్పా మోహ‌న్ రెడ్డి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. 100కు 100 శాతం పోటీ చేసి తీరుతామని ప్ర‌క‌టించారు. సీఎం చంద్ర‌బాబు పిలుపు మేరకే ఆయ‌న్ను క‌లిశామ‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి తెలిపారు. సీఎంతో ప‌లు అంశాలు చ‌ర్చించిన‌ట్లు వివ‌రించారు. అంత‌కుముందు చాలా మంది పార్టీ పెద్దలు, మంత్రులతో చర్చించామని వివ‌రించారు. త‌మ‌కు క్యాడర్ ముఖ్యం... వారిని కోల్పోయే పరిస్థితి లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వారిని కోల్పోతే తిరిగి పొంద‌లేమ‌ని అందుకే వారి నిర్ణ‌యాన్ని పాటిస్తామ‌ని మోహ‌న్ రెడ్డి తెలిపారు.

సోద‌రుల‌మ‌యి తాము రాజ‌కీయాల్లో ఎవరిని ఇబ్బందులు పెట్ట‌కుండా ఉంటున్న‌ప్ప‌టికీ కొన్ని రూపాల్లో త‌మ‌కు చాలా ఇబ్బందులు ఉన్నాయని శిల్పా మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము పోటీ చేయకపోతే క్యాడర్ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంటూ అందరితో చర్చించిన తరవాత నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. 100కు 100 శాతం పోటీ చేసి తీరుతామని మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. బ‌రిలో దిగే విష‌యంలో 4-5 రోజుల్లో నిర్ణయం వస్తుందని మోహ‌న్ రెడ్డి తెలిపారు. ఎన్నిక‌ల సంప్ర‌దాయానికి విరుద్ధంగా వెళ్ళడం లేదని తెలిపారు.

నంద్యాల ఉప ఎన్నిక‌లో త‌మ కుటుంబ‌మే బ‌రిలో ఉంటుంద‌ని చెప్పిన మంత్రి భూమా అఖిల ప్రియ వ్యాఖ్యల పై స్పందించలసి అవసరం లేదని తేలిక‌గా కొట్టిపారేశారు. ఉప ఎన్నిక‌లో బ‌రిలో నిలేచే విష‌యంలో క్యాడర్ నిర్ణయాన్ని వ్యతిరేకంగా వెళ్లలేమ‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. సీఎం చంద్ర‌బాబు నిర్ణయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలని ఆయ‌న కోరారు.
Tags:    

Similar News