వచ్చే వారం జగన్ భారీ కుంభకోణం బయటపెడతా: లోకేష్ కామెంట్స్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే వారంలోనే జగన్ భారీ కుంభకోణం బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆరోగ్య సంజీవని పేరిట ఏర్పాటు చేసిన వైద్య సేవల కేంద్రాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జగన్‌వి పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివి తేటలని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎం జగన్ కు వాటా ఎంత అనే దానిపై చర్చ జరుగుతోందని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే.. చర్చకు తాము సిద్ధమని నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రానికి పరిశ్రమలు ఏవిధంగా తీసుకురావాలి? దానివెనుక ఎంత కష్టం ఉంటుందో తెలియని వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి కియా, వాక్స్‌కాన్, హెచ్‌సీఎల్, అదానీ డేటా సెంటర్, ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్ పరిశ్రమలను తీసుకొచ్చింది చంద్రబాబే అన్నారు. జగన్ వెళ్లి రిబ్బన్ కట్ చేస్తున్న ప్రతి పరిశ్రమ తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిందేనని తేల్చిచెప్పారు. తాము తెచ్చిన పరిశ్రమలను జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. దాదాపు 500 హామీల్లో మాటతప్పి మడమ తిప్పిన జగన్‌మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాల్లో గెలిపించాలా? అని నిలదీశారు. ఈడీ, ఐటీ, సీబీఐల భయంతో ఢిల్లీలో జగన్ తన మెడ వంచుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జగన్ ఏమి సాధించారు అని ప్రశ్నించారు.
'అందరికీ ఆరోగ్యమస్తు – ఇంటికి శుభమస్తు' నినాదంతో తన సొంత నిధులతో ఆరోగ్య సంజీవని పేరుతో మంగళగిరిలో ఉచిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించాననన్నారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్య సంజీవని పేరుతో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు.
కాగా ఈ వైద్య కేంద్రానికి అవసరమైన వైద్యులు, సిబ్బంది, చికిత్స పరికరాలను సమకూర్చానన్నారు. ఇక్కడ దాదాపు 200కు పైగా రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారని వెల్లడించారు.