బీజేపీ ఎంపీల తీరు.. మోడీకే నచ్చలేదు!

Update: 2019-07-02 12:18 GMT
ప్రస్తుతం లోక్ సభలో ఉన్న వారిలో మెజారిటీ సభ్యులు భారతీయ జనతా పార్టీ వాళ్లే! దేశ ప్రజలు ఏకంగా మూడు వందలకు పైగా సీట్లను బీజేపీకే కట్టబెట్టారు. దాని మిత్రపక్షాలు కూడా బాగానే సీట్లను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని రీతిలో వరసగా రెండోసారి తీర్పునిచ్చారు దేశ ప్రజలు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. లోక్ సభకు మొహం చాటేస్తున్నారు బీజేపీ ఎంపీలు. మెజారిటీ బీజేపీ ఎంపీలు లోక్ సభకు హాజరు కావడం లేదట. ఇటీవలే ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలకు సభ పెద్దగా పట్టడం లేదు. వరసగా ప్రతి రోజూ ఇదే పరిస్థితే కొనసాగుతూ ఉంది.

ప్రతిపక్షానికి ఉన్నదేమో తక్కువ మంది ఎంపీలు. ఉన్న వాళ్లంతా కమలం పార్టీ వాళ్లే అన్నట్టుంది పరిస్థితి. అయితే వారు మాత్రం సభకు రావడానికి పెద్దగా ఆసక్తే చూపడం లేదు. దీంతో ఈ విషయం మీద మోడీకే ఆగ్రహం కలిగినట్టుగా సమాచారం.

 ఈ విషయంలో ఆయన తన పార్టీ నేతలతో అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి పంపిస్తే సభకు రావడానికి ఏమైంది? అంటూ మోడీ అన్నారట. ఎంపీలు సభకు హాజరు కాకపోవడం తనకు నిరాశకు గురి చేస్తోందని - ఎంపీలంతా వచ్చి వివిధ అంశాలపై చర్చలో పాలుపంచుకోవాలని మోడీ సూచించినట్టుగా సమాచారం. మొత్తానికి సభకు హాజరు కానీ ఎంపీలకు మోడీ ఇలా హితబోధ చేసినట్టుగా ఉన్నారు. మరి ఈ బోధకు స్పందించి ఎంతమంది ఇక నుంచి లోక్ సభకు సవ్యంగా హాజరవుతారో!

Tags:    

Similar News