పొరుగు రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరమైన చర్చకు తెరతీస్తున్నాయి. అధికార పార్టీ రథసారథి అయిన నరేంద్ర మోడీ - ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీకి ఇది పరీక్ష అని పేర్కొంటున్నారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కర్ణాటకలో బీజేపీ - కాంగ్రెస్ ల జయాపజయాలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ - మిజోరం అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. కర్ణాటక ఫలితాల ఆధారంగానే 2019 లోక్‌సభ ఎన్నికలలో కూటములు - వ్యూహాలు రూపొందనున్నాయని పేర్కొంటున్నారు. ఇది మోడీ - రాహుల్ సత్తాకు నిదర్శనమని చెప్తున్నారు.
తాము పరిపాలిస్తున్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఆ విజయం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలదొక్కు కున్నట్లేననేది విశ్లేషకుల మాట. గత లోక్‌సభ ఎన్నికల్లో 44 స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ 2019 నాటికి బలం పుంజుకొనేందుకు ఈ ఫలితాలను ఆసరాగా చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయడం ద్వారానే బీజేపీతో తలపడవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల సోనియాగాంధీ నిర్వహించిన విందు భేటీకి 20 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. కర్ణాటకలో విజయంతో ఈ మహాకూటమికి నాయకత్వం వహించే అవకాశాన్ని కాంగ్రెస్ పొందవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతను - మోడీ-షాల రాజకీయ చతురతను ఎదురొడ్డి నిలిచిన ధీరుడుగా సిద్దరామయ్య పేరొందుతారని విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికలను లౌకికవాదానికి, మతోన్మాదానికి మధ్య పోరుగా మార్చేసిన కాంగ్రెస్ సానుకూల ఫలితాలు వస్తే వచ్చే అన్ని ఎన్నికల్లోనూ అదే నినాదాన్ని కొనసాగించవచ్చంటున్నారు.
ఇక రాష్ట్రంలో ప్రతిపక్షమైన బీజేపీ గెలిస్తే రాజకీయాల్లో మార్పు ఉంటుందని అంటున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటోంది. ప్రధాని మోడీ ప్రాబల్యం తగ్గిపోయిందని ప్రచారం చేసుకుంటోంది. అయితే అలా తగ్గలేదని ఆ పార్టీ రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలో గెలిస్తే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మూడు పెద్ద రాష్ర్టాలలో తాము ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్నామని చెప్పుకోవచ్చు. తమ రాజకీయ ఎత్తుగడలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పి మోడీ-అమిత్‌షా ద్వయం విమర్శకుల నోళ్లు మూయించవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై తిరిగి ప్రశ్నలు వెల్లువెత్తుతాయని అంటున్నారు.
ఇదే సమయంలో రాబోయే కాలంలో ఉండే రాజకీయాలను సైతం విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే, 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెసేతర మూడోఫ్రంట్ ఏర్పాటుకు మరింత ప్రేరణ లభించే అవకాశం ఉంది.. యూపీలో ఎస్పీ, బీఎస్పీలు తప్పనిసరిగా జతకట్టవచ్చు. మిత్రపక్షంగానే ఉంటూనే అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్న శివసేన మహారాష్ట్రలో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని ఇప్పటికే ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో అధికార పీడీపీ-బీజేపీ కూటమి బీటలు వారుతున్నది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే శివసేన - పీడీపీ వైఖరిలో మార్పు రావచ్చు.