తన ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యను దేశ విభజనతో పోల్చారు. ``కాంగ్రెస్ హయాంలోనే భారత్, పాక్ విభజన జరిగింది. ఆ సమస్య ఇంకా తీరలేదు. కాంగ్రెస్ హయాంలోనే విభజించిన ఏపీ, తెలంగాణ సమస్య కూడా అలాగే ఉంది` అని అన్నారు. అదే వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ర్టాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి గొడవలు జరగలేదన్నారు. కాగా విభజన సమస్యల విషయంలో టీఆర్ఎస్ పార్టీ సంయమనంతో వ్యవహరించిందని ప్రధానమంత్రి అన్నారు. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకుందని ప్రధాని మండిపడ్డారు.
సంఖ్యాబలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు తెచ్చారన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొంటూ ``అవిశ్వాసంపై చర్చ చేపడితే భూకంపం వస్తుందన్నారు. ఏదీ ఆ భూంకంపం?` అని టీడీపీ సారథ్యంలోని విపక్షాల తీరును ఎద్దేవా చేశారు. ``14వ ఆర్థిక సంఘం సిఫార్సులు మమ్మల్ని కట్టడి చేశాయి. 2016లో సెప్టెంబర్‌లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. సీఎం కూడా స్వాగతించారు. 14వ ఆర్థిక సంఘం సాధారణ, ప్రత్యేక రాష్ర్టాల విషయాన్ని పక్కనపెట్టాలని సిఫార్సు చేసింది. ఈశాన్య రాష్ర్టాలు, పర్వతప్రాంత రాష్ర్టాల ప్రాతిపదికన చూడాలని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయంలో ఎన్డీఏ వెనక్కిపోయే ప్రసక్తే లేదు`` అని మోడీ అన్నారు. రాజధాని, రైతులకు సంబంధించిన విషయాల్లో ఎన్డీఏ ప్రభుత్వం వెనకడుగు వేయదన్నారు. తెలుగుతల్లి స్ఫూర్తిని కాపాడాలని మోడీ పేర్కొన్నారు.
అవిశ్వాస తీర్మానం విపక్షాలకే కానీ.. తమ సర్కార్‌కు కాదని ప్రధాని మోడీ అన్నారు. 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ ఆధిక్యంతో వచ్చిన ప్రభుత్వానికి విశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగపడే సందర్భం ఇదని ప్రధాని మోడీ అన్నారు. అహంకారపూరిత ధోరణే వారిని ఈ దిశగా పురిగొల్పిందన్నారు. ప్రధాని సీట్లో ఎప్పుడు కూర్చుందామనే వారి ఆరాటం తప్ప ప్రజా ప్రయోజనం కాదన్నారు.``కాంగ్రెస్‌కు ఏ విషయంలోనూ విశ్వాసం లేదు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ విమర్శిస్తూనే ఉంది. ఆర్‌బీఐ, ఎన్నికలు, ఈవీఎంలు, ఏ విషయంలోనూ కాంగ్రెస్‌కు విశ్వాసం లేదు. కానీ దేశానికి, ప్రపంచానికి దిగ్గజ ఆర్థిక సంస్థలకు తమ ప్రభుత్వంపై విశ్వాసం ఉంది` అని ప్రధాని తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో నాలుగేళ్లుగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ``18 వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చాం. 32 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిపించాం. ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖకు ఎగువకు తీసుకురాగలిగామన్నారు. ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే భాగ్యవిధాతలు. 125 కోట్లమంది ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే తాము అధికారంలో ఉన్నాం. ఇది ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష కాదు. కాంగ్రెస్‌కే ఒక పరీక్ష. ఓటుబ్యాంకు కోసం కాకుండా సబ్ కా సాథ్- సబ్ కా వికాస్ నినాదంతో పని చేస్తున్నాం` అని ప్రధాని పేర్కొన్నారు. ``2019లో మమ్మల్ని అధికారంలోకి రానివ్వమంటున్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారు అలాగే మాట్లాడుతారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధాని అవుతారని ఆకాంక్ష తప్పితే ఇతర సమస్యలపై ఏం చేస్తారో తెలియదు` అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పనితీరును గుర్తించడానికి విపక్షాలకు మనసొప్పడం లేదని మోడీ అన్నారు.