అవిశ్వాసంపై మోడీ వ్యూహం ఇదేనా?

Update: 2018-07-20 04:38 GMT
అవిశ్వాస తీర్మానం అంతిమంగా ఏం కానుంద‌న్న దానిపై ఎవ‌రికి ఎలాంటి ఆస‌క్తి లేదు. ఎందుకంటే.. తుది ఫ‌లితం చాలా క్లియ‌ర్ గా క‌నిపిస్తున్న‌దే. అద్భుతాలు చేసే ప‌రిస్థితి విపక్షాల ద‌గ్గ‌ర లేనే లేదు. అంతేకాదు.. తాజా అవిశ్వాసంతో కొత్త మిత్రుల లెక్క‌లు తెర మీద‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు.

అవిశ్వాసంతో మోడీ స‌ర్కారును ఇరుకున ప‌డేసి.. తాము రాజ‌కీయ ల‌బ్థిని పొందుతామ‌ని టీడీపీ అధినేత.. ఏపీ సీఎం చంద్ర‌బాబు భావించినా.. అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌లేదు స‌రిక‌దా.. రివ‌ర్స్ గేర్ లో లెక్క తేడా కొట్టేసిన ప‌రిస్థితి. క‌లిసి వ‌స్తార‌ని భావించిన పార్టీలు అండ‌గా నిల‌వ‌టం త‌ర్వాత‌.. పార్టీ ఎంపీలే స‌హ‌క‌రించ‌ని ప‌రిస్థితి. టైం చూసి బాబును ఉక్కిరిబిక్కిరి చేసిన జేసీ.. ఎట్ట‌కేల‌కు అల‌క‌పాన్పు వీడి.. బాబు విడుద‌ల చేసిన జీవోతో సంతృప్తి చెందిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు బ‌య‌లుదేరారు.

సొంత పార్టీ నేత‌ల్నే కంట్రోల్ చేయ‌లేని బాబు.. జాతీయ స్థాయిలో పార్టీల‌ను ఏక‌తాటి మీద‌కు తెచ్చే స‌త్తా లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ మాట‌కు వ‌స్తే.. త‌మ‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప‌లు పార్టీలు ఇచ్చినా.. టీడీపీ అవిశ్వాస తీర్మానాన్నే ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌నే దానికి స్పీక‌ర్ తో స‌హా ప‌లువురు లాజిక్కులు చెప్పినా.. అస‌లు కార‌ణం మాత్రం ఒక్క‌టే. బాబు అవిశ్వాసంతో మోడీ స‌ర్కారుకు క‌లిగే ప్ర‌యోజ‌న‌మేన‌ని చెప్పాలి.

బాబు చెబుతున్న ఏపీ విభ‌జ‌న హామీల విష‌యంలో ఏ పార్టీకి ఎంత‌మేర ఇంట్ర‌స్ట్ ఉంటుంది చెప్పండి. ఆ మాట‌కు వ‌స్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ పై ఏపీ దాయాది తెలంగాణ ప్ర‌భుత్వానికే ఇష్టం లేదు. త‌మిళ‌నాడు అయితే ఓపెన్ గానే త‌మ వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసేసింది కూడా. ఇవే కాదు.. మ‌రిన్ని రాష్ట్రాలు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్‌ కు నో చెప్పేస్తున్న ప‌రిస్థితి.

ఏపీ ఎక్క‌డ అత్య‌ధిక ప్ర‌యోజ‌నం పొందితే.. దాని ప్ర‌భావం త‌మ‌పై ప‌డుతుంద‌న్న భ‌య‌మే ఆయా రాష్ట్రాల‌ను అలా మాట్లాడిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌.. అవిశ్వాస తీర్మానంపై జ‌రిగే చ‌ర్చ స‌మ‌యంలో మోడీ ప్లాన్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తానేం చేయ‌నున్నాన్న విష‌యాన్ని.. పార్టీల‌కే కేటాయించిన స‌మ‌యాన్ని చూస్తేనే అర్థ‌మైపోతుంది. అంకెల ఆధారంగా చూస్తే.. స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కాంగ్రెస్ కు లేదు. అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ అలాంటి రోల్ ప్లే చేస్తున్న‌ది. ఇదిలా ఉంటే.. అధికార‌పక్షంగా ఉన్న బీజేపీ ఏకంగా 213 నిమిషాలు మాట్లాడే అవ‌కాశాన్ని పొందితే.. కాంగ్రెస్‌ కు కేవ‌లం 29 నిమిషాలు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశాన్నిక‌ల్పించారు.

ప్ర‌జాస్వామ్యంలో అధికార‌ప‌క్షం కంటే కూడా విప‌క్షానికి ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించ‌టం ఆరోగ్యక‌ర‌మైన వాతావ‌ర‌ణంగా చెబుతారు. అలాంటి విలువ‌ల్ని పాటించే పరిస్థితి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆశించ‌టం అత్యాశే అవుతుంది. కాకుంటే..క‌నీసం అధికార‌ప‌క్షం మాట్లాడే స‌మ‌యంలో స‌గ‌భాగ‌మైన కేటాయించి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా.. త‌మ వాద‌న‌ను బ‌లంగా వినిపించ‌టానికి వీలైనంత స‌మ‌యాన్ని మోడీ స‌ర్కారు తీసేసుకుంద‌ని చెప్పాలి.

ఇదొక్క‌టి చాలు.. ఈ రోజు స‌భ‌లో ఏం జ‌రుగుతుందో అర్థం చేసుకోవ‌టానికి. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేవ పెట్టిన టీడీపీ 13 నిమిషాలు మాత్ర‌మే మాట్లాడే వెసులుబాటు ఉంటే.. దీనిపై కౌంట‌ర్ ఇచ్చేందుకు ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ హ‌రిబాబుకు అధికార‌ప‌క్షం ఏకంగా 15 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించింది. ఇదంతా చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే. అవిశ్వాస తీర్మానం నేప‌థ్యంలో అధికార ప‌క్షాన్ని ఉతికి ఆరేయాల‌న్న విప‌క్ష ఆలోచ‌న‌లు నెర‌వేరేలా క‌నిపించ‌ట్లేదు. అంతేకాదు.. అత్య‌ధిక స‌మ‌యాన్ని చేతిలో ఉంచుకున్న మోడీ అండ్ కో.. త‌మ గ‌ళాన్ని బ‌లంగా వినిపించ‌టం ఖాయం. ఇక‌.. త‌న మాట‌ల‌తో ఎంత‌టి వారి మ‌న‌సుల్ని అయినా ప్ర‌భావితం చేసే మోడీ మేజిక్.. ఈ రోజు బ‌లంగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని పుర‌స్క‌రించుకొని విప‌క్షాల‌పై మోడీ ఒక రేంజ్లో విరుచుకుప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. మ‌రి.. ఏపీ అంశాల‌పై మోడీ ఏం మాట్లాడ‌తార‌న్న‌ది కూడా కీల‌కం కానుంది. తాను చాలా చేసిన‌ట్లుగా చెప్ప‌టంతో పాటు.. ఏపీ అంశాల‌కు త‌న ప్ర‌సంగంలో పెద్దగా ట‌చ్ చేయ‌కుండా..జాతీయ అంశాల్ని ప్ర‌స్తావిస్తూ.. విప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌టం ఖాయ‌మంటున్నారు.


Tags:    

Similar News