గుంటూరులో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌!

Update: 2015-07-11 11:44 GMT
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్రకు ఏడు జాతీయ విద్యా సంస్థలు ఇవ్వాలి. వీటిలో ఇప్పటికే ఐదింటిని మంజూరు చేశారు. వీటిలో కొన్నింటిలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ)ని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిని నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, అమరావతి పేరిట గుంటూరులో దీనికి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇప్పటి వరకు అయితే దేశవ్యాప్తంగా ఒక్క అహ్మదాబాద్‌లోనే ఈ ఎన్‌ఐడీ ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరొక నాలుగు ఎన్‌ఐడీలను మంజూరు చేసింది. వీటిలో నవ్యాంధ్రకు కేటాయించిన ఎన్‌ఐడీ అమరావతిలో ఏర్పాటు అవుతోంది. దీనిలో ఈ విద్యా సంవత్సరంనుంచే తరగతులను కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఏడాది నుంచే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంకా చెప్పాలంటే రాజధాని అమరావతిలో వస్తున్న మొట్టమొదటి జాతీయ విద్యా సంస్థ కూడా ఇదే. ఆగస్టు, సెప్టెంబరుల్లో దీనికి సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News