ఆంధ్రోడు అయినా ఎన్టీవోడు గొప్పోడన్న నాయిని

Update: 2015-08-07 06:56 GMT
వెనుకా ముందు చూసుకోకుండా తిట్టి పారేయాలంటే తెలంగాణ అధికారపక్షానికి చెందిన టీఆర్ ఎస్ నేతలు ఎందరో ఉన్నారు. ఆంధ్రా అన్న మాట వినిపిస్తేనే కస్సున లేచే నేతల్లో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒకరు. కానీ.. అలాంటి ఆయన తాజాగా ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు.

ఆంధ్రోళ్లంతా చెడ్డోళ్లు కాదన్నట్లుగా ఆయన వ్యాఖ్య సాగింది. తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీవోడి మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్నాడని చెప్పే చెన్నారెడ్డిని పొగిడేయటం గమనార్హం.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆంధ్రా వ్యక్తి అయినా మంచివారని.. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలపై 610 జీవో తీసుకొచ్చిన మనిషి అని కొనియాడారు. తెలంగాణ నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని అనాడే గుర్తించిన పెద్ద మనిషిగా ఎన్టీఆర్ ను అభివర్ణించారు.

ఓ పక్క ఎన్టీఆర్ ను పొగిడిన నోటితోనే.. తెలంగాణ ఉద్యమాన్ని చురుకుగా సాగించారంటూ చెన్నారెడ్డిని పొగిడేసి.. ఆయన చేసిన పోరాటానికి ఎవరూ సాటి రారంటూ వ్యాఖ్యలు చేయటం నాయిని మాత్రమే సాధ్యమని.. ఆయన వ్యాఖ్యలు విన్న వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News