ఆ మంత్రి వ‌ల్ల లాభ‌మేంటప్పా... జిల్లా ప్ర‌జ‌ల గ‌గ్గోలు..!

Update: 2022-01-20 09:44 GMT
ఒక్క ప‌థ‌కం గురించి తెలియ‌దు. ఏమైనా అడిగితే.. అది అంతేనబ్బా.. సీఎం చెప్పారు... చేయాల్సిందే! అంటూ.. వ్యాఖ్యానిస్తున్నారు. పోనీ.. స‌ద‌రు ప‌థ‌కం మంచి చెడులు ఏమైనా చెబుతున్నారా? అది కూడా లేదు. పైగా.. త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలోనూ అభివృద్ధిని ఏమైనా ప‌రుగులు పెట్టిస్తు న్నారా? అంటే.. అది కూడా లేదు. దీంతో ఆయ‌న వ‌ల్ల మ‌న‌కేంటి ప్ర‌యోజ‌నం అనే టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాలోని ఒక‌ కీల‌క మంత్రికి సంబంధించి.. ఇప్పుడు జోరుగానే చ‌ర్చ సాగుతోంది.

సాధార‌ణంగా ఏ నాయ‌కుడైనా.. ప్ర‌జ‌ల‌ను ఎక్కువ‌గా మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అనంత‌రం.. పార్టీపై శ్ర‌ద్ధ చూపిస్తారు. ఎందుకంటే. ముందు త‌న‌కు ఇమేజ్ ఉంటే.. త‌ర్వాత‌.. పార్టీ అనూహ్యంగా టికెట్ ఇస్తుంది. అయితే. ఈ మంత్రి విష‌యంలో మాత్రం.. కేవ‌లం జ‌గ‌న్‌ను పొగిడేందుకు పార్టీని ఆకాశానికి ఎత్తేసేందుకు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో నియోజ‌వ‌క‌ర్గంలో ప్ర‌జలు కూడాఈ య‌న‌ను క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇటీవ‌ల పొరుగున ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యేను క‌లుసుకుని త‌మ క‌ష్టాలు చెప్పుకొనే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇది అన్ని ప‌త్రిక‌ల్లోనూ రావడంతో స‌ద‌రు మంత్రి వ‌ర్యుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టాయి. వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గం లో వరుస‌గా స‌మావేశాలు ఏర్పాటు చేసి..నేనే మీకు ఏం తక్కువ చేస్తున్నాను? అని మండి ప‌డ్డారు. అయి తే.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి ఏ ప‌థ‌కం అందుతోందో మీకు తెలుసా?  క‌నీసం.. మాకు రేష‌న్ కార్డు కూడా ద‌క్క‌లేదు. అని చాలా మంది ప్ర‌జ‌లు... ఆయ‌న‌ను న‌నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ ఇస్తానంటూ.. ఆయ‌న అక్క‌డ నుంచి త‌ప్పించుకున్నారు.

ఆ వెంట‌నే.. స‌చివాల‌య సిబ్బందిపై చిందులు తొక్కారు. మీరు ఎందుకు ల‌బ్ధిదారుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు? అని వారిని నిల‌దీశారు. అయితే.. వారు.. సార్ మీ న‌నుంచి ఎలాంటి ప్ర‌పోజ‌ల్ రాలేదు.. దీంతో వ‌చ్చిన వారికి వ‌చ్చిన‌ట్టు న్యాయం చేశాం. మీద‌గ్గ‌ర ఉన్న అప‌ప్లికేష‌న్ల సంగ‌తి మాకు ఎలా తెలుస్తుంది? అని వ్యాఖ్యానించారు. దీంతో నియోజ‌కవ‌ర్గంపై త‌న పట్టు పోతోంద‌న‌ని.. అప్ప‌టికి గ్ర‌హించార‌ట ఆయ‌న. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. 
Tags:    

Similar News