ఆ భారత క్రికెట్ కెప్టెన్ మెదడులో 60 ఏళ్లుగా మెటల్ ప్లేటు.. ఎట్టకేలకు తొలగింపు
1960, 1970 దశకాల్లో వెస్టిండీస్ క్రికెట్ అభేద్యంగా ఉండేది. మొనగాళ్లయిన బ్యాట్స్ మన్ లు.. అరివీర భీకర ఫాస్ట్ బౌలర్లతో అలరారేది. మాల్కం మార్షల్ , జోయల్ గార్నర్, మైకేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్.. ఇలా పదుల సంఖ్యలో బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ వెన్నులో వణుకు పుట్టించేవారు. వీరందరికీ కూడా ఆద్యుడు చార్లీ గ్రిఫిత్. ఒక రకంగా వెస్టిండీస్ పేస్ స్వర్ణ శకానికి రూపశిల్పి.
ఇక ఇలాంటి పేసర్లను ఎదుర్కొనడం బ్యాట్స్ మెన్ కు వెన్నులో వణుకులా ఉండేది. అయితే, మొదటి నుంచి టీమిండియాలో కొందరు బ్యాట్స్ మన్ మాత్రం వెన్ను చూపకుండా నిలిచేవారు . వీరిలో మనకు బాగా తెలిసినది లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్. 1970-80ల్లో గావస్కర్ హెల్మెట్
కూడా లేకుండా విండీస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరును మనకు ఇప్పటికీ పాఠాలుగా చెబుతుంటారు.
అప్పట్లో ఒకడుండేవాడు
అయితే గావస్కర్ కంటే ముందు ఒకడు విండీస్ బౌలర్లను ఇలాగే సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతడే నారీ కాంట్రాక్టర్. గుజరాత్ కు చెందిన నారీ ప్రస్తుత వయసు 88 ఏళ్లు. ఈ వయసులో అతడి మెదడులోని ప్లేట్ ను తొలగించారు. సరిగ్గా 60 ఏళ్ల కిందట అంటే 1962లో వెస్టిండీస్ పేసర్ చార్లెస్ గ్రిఫిత్ వేసిన రాకాసి బౌన్సర్ తో నారీ తలకు దెబ్బ తగిలింది. అతడికి శస్త్ర చికిత్స నిర్వహించి మెదడులో ప్లేట్ వేశారు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అయిన నారీకి అప్పటినుంచి ప్లేట్ అలానే ఉంది. టీమిండియా 31 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన నారీ 1,611 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 11 అర్థ సెంచరీలున్నాయి. 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన నారీ.. 8,611 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా మంచి పేరున్న అతడు 1962 వెస్టిండీస్ టూర్ లో గ్రిఫిత్ బౌలింగ్ లో గాయపడ్డాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రం ఆడాడు. తలకు దెబ్బ తగిలాక నారీకి పలు ఆపరేషన్లు జరిగాయి. అయితే, మెదడులో టైటానియం ప్లేట్ అమర్చాక ఇక ఇబ్బంది ఏమీ లేదని డాక్టర్ల తేల్చారు. ఆ ప్లేట్ నే ఇప్పుడు తొలగించారు.
హెల్మెట్ లేకుండానే ఆడి..
గావస్కర్ విండీస్ బౌలర్లను హెల్మెట్ లేకుండానే ఆడాడని మనం గొప్పగా చెప్పుకొంటాం. కానీ, అతడి కంటే ముందే నారీ ఆ పని చేశాడు. అలా హెల్మెట్ లేకుండానే ఆడుతూ గాయపడ్డాడు. అయితే, బౌన్సర్ ధాటికి అతడు విలవిల్లాడాడు. నాటి వెస్టిండీస్ కెప్టెన్ ఫ్రాంక్ వారెల్.. నారీని తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లేలా చూశారు.