ప్రస్తుతం వాట్సాప్ యాప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై యూజర్లు కోపంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా యూజర్లు.. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్‌ల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం కూడా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ‘సందేశ్’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌కు పోటీగా సందేశ్లోనూ పలు రకాల ఫీచర్స్ అందుబాటులోకి ఉన్నాయి. అయితే ఈ సందేశ్ ఎలా ఉండబోతున్నది. వాట్సాప్‌కు పోటీ ఇవ్వబోతుందా? ఇప్పుడు తెలుసుకుందాం..
సందేశ్ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లాంచ్ చేసింది.
సందేశ్ యాప్‌ను వినియోగించాలంటే మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ తప్పనిసరి. ఒక్కసారి సైన్ ఆఫ్ అయ్యాక యూజర్లు వాట్సాప్ మాదిరిగానే మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు. వాట్సాప్ తరహాలోనే ఇందులో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండనున్నది. ప్రభుత్వం జీఐఎంఎస్ పోర్టల్‌తో దీనికి సంబంధించిన ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐవోఎస్ వినియోగదారులు యాప్ స్టోర్‌లో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఐఫోన్, ఐప్యాడ్ ద్వారా వినియోగించుకోవచ్చు.
సైన్ఆఫ్ అయ్యాక మొబైల్ నంబర్‌కు వచ్చే ఆరు అంకెల ఓటీపీ నంబర్‌తో ఈ యాప్‌ను ధ్రువీకరించుకోచ్చు. అయితే ఈ యాప్ చూడటానికి అచ్చం వాట్సాప్ లాగే ఉన్నప్పటికీ .. కొన్ని వేరే ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వెరిఫైడ్ అకౌంట్ కూడా అందిస్తోంది. సందేశ్ చాట్ బ్యాకప్‌లను ఈ మెయిల్‌తోపాటు ఎక్స్టర్నల్ లొకేషన్‌కు కూడా పంపించుకోవచ్చు.
టెలిగ్రాం, వాట్సాప్ , సిగ్రల్ తరహాలోనే దీన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అధికారిక కార్యకలాపాలకు కు ఆ యాప్‌ను ఉపయోగించాలని ఉద్యోగులకు కోరుతోంది. ఈయాప్‌ను యూజర్లు ఏమేరకు వినియోగిస్తారో వేచి చూడాలి.