ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్నాయి. ఆదివారం నాలుగో విడత ఎన్నికలతో పంచాయతీ పోరు ముగుస్తోంది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గతంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చనిపోయిన చోట మళ్లీ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ తాజాగా అవకాశం కల్పించారు. అభ్యర్థులు చనిపోయిన చోట ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ వెల్లడించారు.
ఇందులో భాగంగా ఈనెల 28న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. మార్చి 3వ తేది వరకు ఉపసంహరణకు గడువు విధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మిగతా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని..యథాతథంగా ఎన్నికలు ఉంటాయని ఎస్ఈసీ తెలిపారు.
గతంలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిలో 56మంది అభ్యర్థులు వివిధ కారణాలతో చనిపోయారు. అన్ని పార్టీలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. దీంతో ఈ స్థానాలన్నింటిలో నామినేషన్ వేసేందుకు మరోసారి అవకాశం కల్పించారు.
ఏపీలో మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు.. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 12 కార్పొరేషన్లు.. 75 మున్సిపల్, పంచాయతీలకు ఎన్నికలు జరుగునున్నాయి.