అక్రమ పద్ధతిలో వేలాది కోట్ల రూపాయిలు తీసుకొని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిలువునా ముంచేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ లభించినట్లుగా చెబుతున్నారు. వేల కోట్లతో ఎగిరిపోయిన నీరవ్ మోడీ ఆచూకీ కోసం గడిచిన కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
నీరవ్ మోడీ ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. తాజాగా అతగాడి ఆచూకీ మీద స్పష్టత వచ్చింది. అతను బ్రిటన్ లోనే తలదాచుకున్నట్లుగా స్పష్టత వచ్చింది. నీరవ్ మోడీ యూకేలో ఉన్నట్లుగా బ్రిటన్ అధికారులు భారత్ కు ధ్రువీకరించారు.
ఇదిలా ఉంటే.. అతడ్ని తమకు అప్పగించాలని సీబీఐ ఇప్పటికే బ్రిటన్ ను కోరినట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ.13వేల కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేసిన నీరవ్ మోడీ ఆచూకీ లభించిన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకునే దిశగా మోడీ సర్కార్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.