బట్టబుర్రోడికి దొంగ తెలివితేటలు ఎక్కువే!

Update: 2019-03-22 04:16 GMT
మొత్తానికి నీరవ్‌ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఏదో టెలిగ్రాఫ్‌ రిపోర్టర్‌ పుణ్యామా అని అసలు నీరవ్‌ మోడీ అనేవాడు ఎక్కుడున్నాడో ప్రపంచానికి తెలిసింది. ఆ టెలిగ్రాఫ్‌ రిపోర్టర్‌ కానీ నీరవ్‌ మోడీని గుర్తుకుపట్టక పోయింటే ఈపాటికి దర్జాగా లండన్‌ లో పిజ్జాలు తింటూ హ్యాపీగా బతికేసేవాడు.

రూ. 13 వేల కోట్లు పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకున్నాడు నీరవ్‌. ఆ డబ్బులతో వ్యాపారం చేశాడు. అప్పు  కట్టాల్సి వచ్చే టైమ్‌ కి లండన్‌ పారిపోయి అక్కడ దాక్కున్నాడు. అయితే.. తనని ఎప్పటికైనా ఎవరో ఒకరు గుర్తుపడతారని ముందే  ఊహించిన నీరవ్‌.. తెలుగు సినిమాల్లో విలన్‌ గా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలని కూడా ప్లాన్‌ చేశాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాకు దూరంగా ఉండే ఓ చిన్న దేశం వేటివగాలో పౌరసత్వం తీసుకునేందుకు  కూడా ట్రై చేశాడు. ఒకసారి పౌరసత్వం వచ్చిన తర్వాత ఆ దేశ పౌరుడ్ని అరెస్ట్ చెయ్యకూడదు. ఒకవేళ చెయ్యాలంటే ఆ దేశంలో నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరగాలి. ఈలోగా పుణ్యకాలం కాస్తా అయిపోతుంది. అందుకే ఆ చిన్న దేశానికి వెళ్లిపోదామని ప్లాన్‌ చేసుకునే లోపలే టెలిగ్రాప్‌ రిపోర్టర్‌ కి దొరికి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం లండన్‌ లో ఊచలు లెక్కపెడుతున్నాడు. పైకి మొద్దబ్బాయిలా కన్పించే ఈ బట్టబుర్రోడికి దొంగ తెలివితేటలు ఎక్కువే మరి.
Tags:    

Similar News