యాక్ట్ ఆఫ్ గాడ్ ఒకే , మరీ గతం పరిస్థితి ఏంటో చెప్పండి దైవదూత నిర్మలా సీతారామన్ !
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇక కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ .. ఆర్థిక వ్యవస్థ పై యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం విరుచుకుపడ్డారు . ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థ పై చేసిన 'యాక్ట్ ఆఫ్ గాడ్' వ్యాఖ్యలపై ఫైర్ అయ్యి , దేవుని దూతగా ఆర్ధిక శాఖామంత్రి సమాధానం ఇవ్వాలన్నారు.
కరోనావచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ,కరోనా దేవునిచే చెయ్యబడిన ఒక చట్టం గా మారటం వల్ల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఆర్ధిక తిరోగమనాన్ని చూస్తుందని ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై చిదంబరం మాట్లాడుతూ, "మహమ్మారి 'దేవుని చట్టం' అయితే, దైవ దూత నిర్మలా సీతారామన్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కరోనాకు ముందు ఆర్ధక వ్యవస్థ పతనం అవుతూ వచ్చిందని , 2017-18, 2018-19 మరియు 2019-20 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ యొక్క దుర్వినియోగాన్ని ఎలా చూడాలో చెప్పాలని ఆయన నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు.
మహమ్మారి రాక ముందు దేశ ఆర్దిక వ్యవస్థ పరిస్థితి ఎందుకు క్షీణించిందని , అందు గల కారణం ఏమిటో దేవుని దూతగా ఆర్ధిక మంత్రి నిర్మల దయచేసి సమాధానం చెప్పాలి అని కోరారు. జీఎస్టీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నందున ఆదాయ నష్టాలను భర్తీ చెయ్యటం కోసం ఎక్కువ రుణాలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరినందుకు చిదంబరం కేంద్రంపై పై వ్యాఖ్యలు చేశారు .జీఎస్టీ పరిహార అంతరాన్ని తగ్గించడానికి మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన రెండు ఎంపికలు ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు
మొదటి ఎంపిక కింద రాష్ట్రాలు తమ భవిష్యత్ రాబడిని పరిహార సెస్ కింద తాకట్టు పెట్టడం ద్వారా రుణాలు తీసుకోమని కోరటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక భారం పూర్తిగా రాష్ట్రాలపై పడుతుందని ,రెండో ఆప్షన్ కింద, ఆర్బిఐ విండో నుండి రుణాలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరటం కూడా కరెక్ట్ కాదని ఆయన అన్నారు . ఇది కూడా ఎక్కువ రుణాలు వేరే పేరుతో తీసుకోమని చెప్పటం మాత్రమేనని మళ్ళీ, మొత్తం ఆర్థిక భారం రాష్ట్రాలపై పడుతుంది అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏ ఆర్థిక బాధ్యతనైనా కేంద్ర ప్రభుత్వం స్వయంగా నిర్వర్తించాలని , అలా కాకుండా రాష్ట్రాల మీద ఆర్ధిక భారం పెట్టటం సమంజసం కాదని చిదంబరం చెప్పారు.