నిద్ర లేచింది పడుకునే వరకు కులం.. మతం ప్రస్తావన లేకుండా రోజు గడవని పరిస్థితి. గతంతో పోలిస్తే ఈ మధ్యన ఈ రెండింటికి ప్రాధాన్యత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో ఇలాంటి వాటికి ప్రాధాన్యత కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటే.. మరికొన్నిప్రాంతాల్లో పెద్దగా పట్టించుకునే వారు కాదు.
ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా కులానికి.. మతానికి ప్రాధాన్యతను ఇచ్చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అలాంటి ఈ రోజుల్లో రోటీన్ కు భిన్నంగా తమ పాపకు కులమే కాదు మతం కూడా లేదని.. ఈ రెండింటి రహితంగా తమ పాపను పెంచుతున్నట్లుగా వెల్లడించారు నరేష్.. గాయత్రి దంపతులు.
తమిళనాడుకు చెందిన ఈ యువ దంపతులు తమ మూడేళ్ల పాప విల్మకు కులం.. మతంతో సంబంధం లేని రీతిలో నో క్యాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికేట్ ను సొందారు. కోయంబత్తూరు జిల్లా సంగనూరుకు చెందిన వారు.. తమ పాపకు కులం.. మతం అవసరం లేదని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి వారిచ్చిన అఫిడవిట్ కు స్పందించిన కోయంబత్తూర్ నార్త్ తహసీల్దార్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేశారు.
తమ పాప విల్మను కిండర్ గార్డెన్ స్కూల్లో చేర్పించేందుకు ఈ దంపతులు వెళ్లారు. అయితే.. అక్కడ వారికిచ్చిన స్కూల్ అప్లికేషన్ లో కులం.. మతం ఏమిటో తెలపాలని కోరారు.
దీనికి నరేశ్ - గాయత్రి దంపతులు ఒప్పుకోలేదు. దీంతో.. స్కూల్ యాజమాన్యం వారికి సీటు ఇవ్వలేమని పేర్కొన్నారు. దీంతో వారు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ ను కలిశారు.
తమ పాపకు కులం.. మతం లేకుండా పెంచాలని నిర్ణయించామని.. అందుకు తగ్గట్లుగా సర్టిఫఇకేట్ ఇవ్వాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించి సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు కుల.. మత రహిత సర్టిఫికేట్ ను జారీ చేశారు. తమిళనాడులో ఈ తరహాలో సర్టిఫికేట్ పొందటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.