బార్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం !

Update: 2020-06-09 12:52 GMT
వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో అన్ని మూతపడ్డాయి. అయితే, లాక్ ‌డౌన్ నుండి కేంద్రం సడలింపులు ప్రకటించడంతో తిరిగి ఒక్కొక్కటి తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని షాప్స్ ఓపెన్ అయ్యాయి, జూన్ 8 సోమవారం నుండి ఆలయాలు , మాల్స్ ను కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే, ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం బార్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠ నెలకొంది.

అయితే ,రాష్ట్రంలో బార్లు తెరిచేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. బార్లలో మద్యం విక్రయాలు జరపొద్దని తేల్చి చెప్పింది. కానీ, బార్లలో ఉన్న మద్యం సీల్ బాటిళ్లను సమీపంలోని రిటైల్ ఔట్ లెట్ల ద్వారా విక్రయించే వెసులుబాటు కల్పించింది. కేవలం సీల్డ్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని ఆదేశాల్లో తెలిపింది. బార్లు తెరవక పోవడంతో బీర్ బాటిళ్ల కాల పరిమితి ముగిసిపోయే అవకాశముందని.. విక్రయించేందుకు అవకాశం కల్పించాలని ఏపీ వైన్ డీలర్స్ అసోసియేషన్ కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.కాగా, రాష్ట్రంలో వైన్స్‌ షాప్స్ తెరుచుకున్నా, రెండు సార్లు మద్యం ధరలను పెంచేసింది. దీంతో క్రమంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మందగించాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను పెంచామని, మద్యం షాపులను కూడా క్రమంగా తగించినట్టు ప్రభుత్వం చెబుతోంది.
Tags:    

Similar News