దేశంలో 500 - 1000 రూపాయి నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఏపీలో ప్రధాన ఆదాయ వనరులపై దెబ్బ పడుతోంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల ఆదాయంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఈ నెల లక్ష్యాలను ఎలా అధిగమించాలా? అని రిజిస్ట్రేషన్ల శాఖ మల్లగుల్లాలు పడుతోంది.
పెద్ద నోట్ల రద్దు సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని ప్రభుత్వ శాఖల ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉండటంతో లక్ష్యాలను చేరుకునే అంశంపై దృష్టి సారించింది. రిజిస్ట్రేషన్ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3043 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకూ 2219 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. నవంబర్ నెలకు సంబంధించి 260 కోట్ల రూపాయల మేరకు లక్ష్యంగా నిర్ణయించగా - ఇప్పటి వరకూ 151.6 కోట్ల రూపాయల మేరకు ఆదాయం లభించింది. మిగిలిన లక్ష్యాన్ని సాధించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
బ్యాంక్ ల మూసివేత - ఏటిఎంల నుంచి నగదు విత్ డ్రాపై పరిమతులు - నోట్ల మార్పిడిపై కూడా పరిమితి ఉండటంతో దీని ప్రభావం రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా పడనుంది. బ్యాంక్ లకు సెలవులు - నగదు విత్ డ్రాలపై పరిమితుల నేపథ్యంలో లక్ష్యాన్ని సాధించడం కష్టమని అధికారులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/