ప్రస్తుతం కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చైనా లో బయటపడ్డ ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే 26 దేశాలకి వ్యాప్తి చెందిన అందరిని ఆందోళనకి గురిచేస్తోంది. ఈ కరోనా భారిన చైనా లో ఇప్పటికే 1050 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అలాగే వేలకొద్దీ ప్రజలు ఈ వైరస్ భారిన పడి భాదపడుతున్నట్టు తెలిపారు. దీనితో ప్రపంచం మొత్తం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ వచ్చిందేమో అని ఈ మాత్రం చిన్న అనుమానం ఉన్నా వెంటనే వైరస్ కు సంబంధించిన టెస్ట్స్ చేపించుకుంటున్నారు. అయితే , ఈ కరోనా వైరస్ ఎక్కువగా మాంసాహారం నుంచి వచ్చినట్టుగా వార్తలు వస్తున్న తరుణంలో చికెన్ మటన్ తీసుకోవాలి అంటే ప్రజలు భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వెస్ట్ గోదావరి తణులో చికెన్, మటన్ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. వారం రోజులపాటు నాన్ వెజ్ అమ్మకూడదని అల్టిమేటం జారీ చేశారు. ప్రజలెవరూ కూడా చికెన్, మటన్ తినొద్దని తెలిపారు. బుధవారం నుంచి వారం రోజులపాటు ఈ నిషేధం అమల్లోకి వస్తుంది అని తెలిపారు. అంతేకాదు, కోళ్లకు సంబంధించిన వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ వెయ్యొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. అయితే , తణుకులో ఫౌల్ట్రీ పరిశ్రమను ఓ వైరస్ వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఫారాల్లో కోళ్లన్నీ పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ కోళ్లన్నీ కూడా కరోనా భారిన పడే చనిపోతున్నాయి అనే ప్రచారం సాగుతుంది. అయితే , ఆ కోళ్లు చనిపోవడానికి కరోనా కారణం కాదు అని , దానికి వేరే వైరస్ కారణం అని అధికారులు చెప్తున్నారు. ఈనేపథ్యంలోనే అలర్ట్ అయిన ఎమ్మెల్యే.. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని రోజుల పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని కోరారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసమే వారం రోజులు నాన్ వెజ్ హాలీడేగా ప్రకటిస్తున్నామన్నారు. అలాగే జిల్లా వైద్య శాఖ అధికారులు ఆ కోళ్ళకి వచ్చిన వైరస్ ఏమిటి అన్నదాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.